తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Gurukula Schools: ఏపీ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ అడ్మిషన్లు...ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఇలా..

AP Gurukula Schools: ఏపీ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ అడ్మిషన్లు...ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఇలా..

Sarath chandra.B HT Telugu

04 March 2024, 11:26 IST

google News
    • AP Gurukula Schools: ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌AP SWREIS కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బిఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ అడ్మిషన్లు
బిఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ అడ్మిషన్లు

బిఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ అడ్మిషన్లు

AP Gurukula Schools: ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ DR BR Ambedkar గురుకుల విద్యాలయాలు, ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలను బీఆర్‌ఏజీ ఇంటర్ సెట్ 2024 ద్వారా చేపడతారు.

విద్యార్దులు తమ సొంత జిల్లాల్లోని గురుకులResidential Schools విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఎంచుకున్న గ్రూప్ అక్కడ లేకపోతే జిల్లా జోన్‌ పరిధిలో ఉన్న మరో గురుకుల కాలేజీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌Onlineలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్పులు చేయడానికి అనుమతించరు. గురుకుల విద్యా సంస్థల్లో ఎంపికైన విద్యార్ధులకు విద్య, వసతి ఉచితంగా కల్పిస్తారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా 164 గురుకుల విద్యాలయాల్లో 5400 ఎంపీసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. బైపీసీ సీట్లు మరో 5400 ఉన్నాయి. ఎంఈసీలో 800, సీఈసీలో 1600, హెచ్‌ఈసీలో 360 సీట్లు ఉన్నాయి.

వీటితో పాటు ఐఐటీ IITమెడికల్ Medicalఅకాడమీల్లో మొత్తం 600సీట్లు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చెరో 300సీట్లు ఉంటాయి. కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులో ఉన్న బాలికల అకాడమీలో ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో ఒక్కో దానిలో 160సీట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా చిన్న టేకూర్‌లోని బాలుర అకాడమీలో ఒక్కో గ్రూపులో 60సీట్లు, గుంటూరు-అడవి తక్కెళ్లపాడు బాలుర అకాడమీలో ఒక్కో గ్రూపులో 80సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పదో తరగతి విద్యార్హత...

ప్రస్తుతం పదోతరగతి పరీక్షలకు సిద్దం అవుతున్న విద్యార్ధులు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్దులు కూడా గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 ఆగష్టు 31 నాటికి అభ్యర్ధుల వయసు 17ఏళ్లు దాటకూడదు.

ఎంట్రన్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. మొత్తం 100మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఏపీ పదో తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. గణితంలో 25, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ , ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఒక్కో దాన్నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్‌ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

రెండున్నర గంటల్లో 100మార్కులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్‌లో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఏపీబీఆర్‌జీ సెట్‌ 2024లో వచ్చిన మెరిట్ లిస్ట్‌ ఆధారంగా ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్ధుల షార్ట్ లిస్ట్‌ రూపొందిస్తారు. వీరివకి ప్రత్యేకంగా మరో పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ అంబేడ్కర్ గురుకుల విద్యా సంస్థల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోడానికి ఫిబ్రవరి 23వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 10వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 21వ తేదీన ఐఐటీ మెడికల్ అకాడమీల్లో ప్రవేశాలకు పరీక్ష ఉంటుంది.మరిన్ని వివరాలకు https://apbragcet.apcfss.in లో చూడవచ్చు.

తదుపరి వ్యాసం