తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ias Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే

02 July 2024, 18:38 IST

google News
    • AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే
ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, కొత్త కలెక్టర్లు వీళ్లే

AP IAS Transfers : ఏపీలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

కొత్త కలెక్టర్లు వీళ్లే

  • శ్రీకాకుళం -స్వప్నిల్ దినకర్
  • పార్వతీపురం మన్యం -శ్యామ్ ప్రసాద్
  • అనకాపల్లి - కె.విజయ
  • విశాఖ -హరేంధిర ప్రసాద్
  • కోనసీమ- రావిరాల మహేశ్ కుమార్
  • అన్నమయ్య -చామకూర్రి శ్రీధర్
  • సత్యసాయి జిల్లా - చేతన్
  • కడప-లోతేటి శివశంకర్
  • పల్నాడు - అరుణ్ బాబు
  • నెల్లూరు -ఒ.ఆనంద్
  • తిరుపతి - డి. వెంకటేశ్వర్
  • నంద్యాల - బి.రాజకుమారి

ఏపీ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హరేంధిర ప్రసాద్ కలెక్టర్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి విశాఖ జిల్లా మేజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తన బాధ్యతలను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి.కోటేశ్వరరావుకు అప్పగించనున్నారు.

ఇటీవల బదిలీలు

ఏపీలో జూన్ 19న భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇటీవల సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్ ల బదిలీలు

  • జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్
  • వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్
  • పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్
  • పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్
  • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్
  • నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు
  • పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్
  • ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు
  • ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా ఎ.బాబు
  • ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్
  • ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న
  • ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి
  • పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్
  • గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్
  • ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
  • ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్

తెలంగాణలో బదిలీలు

తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల 8 మంది ఐపీఎస్‌ల అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా సుభాష్‌ ను నియమించారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌, ములుగు ఓఎస్‌డీగా మహేష్‌ బాబాసాహెబ్‌, గవర్నర్‌ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్‌, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌ ను నియమించారు. భైంసా ఏఎస్పీగా అవినాష్‌ కుమార్‌, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్‌ ఉపాధ్యాయను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

తదుపరి వ్యాసం