తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Hra Hike : ఏపీ సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు

AP Govt HRA Hike : ఏపీ సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు

29 July 2024, 16:04 IST

google News
    • AP Govt HRA Hike : ఏపీ సర్కార్ సచివాలయ, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచింది. హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు
ఏపీ సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు

ఏపీ సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్- హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు

AP Govt HRA Hike : ఏపీ సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయం, హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 16 శాతంగా హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. అయితే హెచ్ఆర్ఏ మొత్తం రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఆర్ఏ పెంపుపై సోమవారం ఆర్థికశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పీఆర్సీ ఇంకా అమల్లోకి రానందున, వచ్చే ఏడాది జూన్‌ వరకు పెంచిన హెచ్‌ఆర్‌ఏ అమలులో ఉంటుందని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 12వ పీఆర్సీని నియమించాలని కోరుతున్నారు.

మెడికల్ రీయంబర్స్మెంట్ మరో ఏడాది పొడిగింపు

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 పొడిగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు సమాంతరంగా మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

వారానికి ఐదు రోజుల పనిదినాలు

అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్‌పై ఇటీవల సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొ్న్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. రాష్ట్ర సెక్రటేరియట్, హెచ్వోడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయనున్నారు. సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పనివిధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.

తదుపరి వ్యాసం