AP Pensions : మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం-amaravati ap govt orders pension amount deposit to beneficiary accounts for may ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions : మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Pensions : మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Bandaru Satyaprasad HT Telugu
Apr 28, 2024 07:23 PM IST

AP Pensions : ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పింఛన్లు జమ చేయాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పెన్షన్ అందించనున్నారు.

మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే
మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే

AP Pensions : ఏపీలో మే నెల పింఛన్ల పంపిణీ(AP Pensions Distribution)పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత అనుభవాల దృష్ట్యా ఈసీ ఆదేశాల(EC Orders) మేరకు పింఛన్ నగదును మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో(DBT) జమ చేయాలని నిర్ణయించింది. పింఛనుదారులు సచివాలయాలకు రాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే నగదు వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇవాళ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పింఛన్ల పంపిణీపై కలెక్టర్లకు పలు ఆదేశాలు ఇచ్చారు. పింఛన్ లబ్దిదారులను నేరుగా ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు(Bank Accounts) లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మే 1 నుంచి 5వ తేదీ లోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈసీ ఆదేశాలతో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

నేరుగా ఖాతాల్లోకే

వాలంటీర్ల(Volunteers)తో పింఛన్ల పంపిణీ(AP Pensions Distribution) వద్దని మార్చి నెలలో ఈసీ ఆదేశించింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇంటి వద్దే పింఛన్ ఇవ్వాలని తెలిపింది. మిగిలిన వారికి సచివాలయాల(Sachivalayas) వద్ద పంపిణీ చేయాలని తెలిపింది. అయితే సమన్వయలోపంతో పింఛన్ల పంపిణీపై గందరగోళం నెలకొని, సచివాలయాలకు పెన్షన్ కోసం వచ్చి ఎండల కారణంగా 32 మంది వృద్ధులు మరణించారు. పింఛన్ల పంపిణీపై అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకున్నాయి. వృద్ధులను మంచాలపై సచివాలయాలకు తీసుకురావడం వివాదాస్పందం అయ్యింది. ఈ సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ప్రతిపక్షాలు ఈసారి ముందుగా ఈసీకి లేఖ రాశాయి. దీంతో ఈసీ(EC) రాష్ట్ర ప్రభుత్వానికి(AP Govt) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని లేనిపక్షంలో నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేసే ఏర్పాట్లు చేయాలని ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో డీబీటీ(DBT) విధానంలో మే నెల పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

ఈసీ ఆదేశాలు ఇలా

గత నెలలో జారీ చేసిన మార్గదర్శకాలను ఈసారీ పాటించాలని ఈసీ(EC)...సీఎస్ ను ఆదేశించింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పంపిణీ(AP Pensions Distribution) చేపట్టాలని సీఎస్‌(CS)‌ను ఆదేశించింది. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీ(DBT) రూపంలో నేరుగా పింఛనుదారులకు చెల్లించాలని సీఎస్‌కు ఈసీ తెలిపింది. పింఛన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. ఎక్కడా వాలంటీర్లను వినియోగించవద్దని తెలిపింది. వాలంటీర్ల(Volunteers) స్థానంలో ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోవాలని ఈసీ సూచించింది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్లు, వితంతువు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా... వారికి ఇంటి వద్దే పింఛన్లు అందించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ఈసీ.. సీఎస్ కు తేల్చి చెప్పింది.

Whats_app_banner

సంబంధిత కథనం