Alluri News : సంతానం కోసం భర్తకు మూడో పెళ్లి, ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలు
30 June 2024, 16:23 IST
- Alluri News : ఏపీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు కలిసి భర్తలు మూడో పెళ్లి చేశారు. అల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
భర్తకు మూడో పెళ్లి, ఇద్దరు భార్యలే పెళ్లి పెద్దలు
Alluri News : భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి జీవించాలని కోరుకుంటారు. దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం భార్య, భర్తలు సహించరు. వివాహేతర సంబంధాలతో ఇటీవల బంధలు విడిపోతున్నాయి. కానీ ఏపీలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు కలిసి భర్తలు మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ ఘటన జరిగింది.
పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది. పార్వతమ్మకు పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. పండన్న, అప్పలమ్మకు 2007లో మగపిల్లాడు పుట్టాడు. అయితే తనకు రెండో సంతానం కావాలని పండన్న కోరగా ఇద్దరు భార్యలు కలిసి దగ్గరుండి మరో యువతితో మూడో పెళ్లి చేశారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో మరో ఘటన
ఇదీలా తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలకు తెలియకుండా మూడో వివాహానికి సిద్ధమయ్యాడు దినేష్ అనే యువకుడు. మొదటి పెళ్లిని దాచి మరో యువతి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో తరచూ గొడవలు మొదలయ్యాయి. దినేష్ వేధింపులు తట్టుకోలేక రెండో భార్య కూడా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు భార్యలు పుట్టింటికి వెళ్లిపోవడంతో దినేష్ మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని రెండు పెళ్లిళ్లు చేసుకుని, మరో పెళ్లికి సిద్ధమవ్వడంతో... విషయం ఇద్దరు భార్యలు తెలిసింది. ఇద్దరు భార్యలు నడిరోడ్డు మీద దినేష్ ను చితకబాదారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లా సలూరులో చోటుచేసుకుంది.
నడిరోడ్డుపై చితక్కొట్టారు
సూలూరుకు చెందిన రంగ అరవింద దినేష్ రాశిపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. 2016లో తిరుప్పూర్ గణపతిపాళయానికి చెందిన రాజశేఖర్ కుమార్తె ప్రియదర్శినితో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన 15 రోజులకే విభేదాలతో భార్యభర్తల విడిపోయారు. ప్రియదర్శినిని హింసించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు పెళ్లైన విషయం తెలిసి గత ఏప్రిల్ లో అనుప్రియ అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య అనుప్రియతో కూడా దినేష్ కి గొడవలు మొదలయ్యాయి. దీంతో దినేష్ వేధింపులు తట్టుకోలేక అనుప్రియ పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరు భార్యలు పుట్టింటికి వెళ్లిపోయవడంతో దినేష్ మూడో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం ఇద్దరు భార్యలకు తెలియడంతో కోపంతో అతని ఇంటికి వెళ్లి అతడిని బయటకు లాగి చితక్కొట్టారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.