Bhatti Vikramarka : దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం- సీఎం క్షమాపణ చెప్పాలని బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్-yadadri news in telugu bsp brs demands cm revanth reddy apology bhatti vikramarka sitting down ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhatti Vikramarka : దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం- సీఎం క్షమాపణ చెప్పాలని బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్

Bhatti Vikramarka : దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం- సీఎం క్షమాపణ చెప్పాలని బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్

Bandaru Satyaprasad HT Telugu
Mar 11, 2024 02:51 PM IST

Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువు మంత్రులు ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో సీఎం దంపతులు, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమారెడ్డి స్టూల్స్ పై కూర్చొన్నారు. భట్టి విక్రమార్క, కొండా సురేఖ కింద కూర్చోవడం వివాదాస్పదం అయ్యింది.

యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

Bhatti Vikramarka : యాదాద్రిలో దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు(Bhatti Vikramarka) అవమానం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) అన్నారు. దళితులకు అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు.

అసలేం జరిగిందంటే?

సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు, పలువులు మంత్రులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని(Yadagirigutta Temple) దర్శించుకున్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా పాల్గొన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల(Yadadri Brahmotsavalu) ప్రారంభోత్సవం సందర్భంగా తొలిపూజలో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. సీఎంతోపాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ(Konda Surekha) ఎత్తు పీటలపై కూర్చొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీట లేకపోవడంతో ఆయన కింద కూర్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు కంకణధారణ చేసి, వేదాశీర్వచనాలు అందించారు.

బాల్క సుమన్ విమర్శలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్టూల్స్ పై కూర్చోవడం, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka)ను కింద కూర్చోవడంతో వివాదాస్పదంగా మారింది. దళితుడు కాబట్టే కింద కూర్చో పెట్టారనే బీఆర్ఎస్, బీఎస్సీ విమర్శలు చేస్తున్నారు. ఈ ఫొటోను ఎక్స్ లో ట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం జరిగిందన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman)...సోమవారం మీడియాతో మాట్లాడారు. రెడ్డి నాయకుల దగ్గర దళిత బిడ్డను అవమానం జరిగిందన్నారు. ఎస్సీ నేతను కింద కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ కొండా సురేఖను సైతం కింద కూర్చోబెట్టారని ఆరోపించారు. దేవుడి దళిత, బీసీ బిడ్డలకు ఇంత ఘోర అవమానం జరిగితే వాళ్లు ఎవరికి చెప్పుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన భట్టి విక్రమార్కను ఉద్దేశపూర్వకంగానే అవమానించారని బాల్క సుమన్ ఆరోపించారు.

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)యావత్ దళిత జాతిని అవమానించారని బాల్క సుమన్ అన్నారు. 74 ఏళ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు ఘోర అవమానాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా భట్టి విక్రమార్క ఫొటో పక్కన పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ యాడ్స్‌లో డిప్యూటీ సీఎం ఫొటోను వేయడంలేదని విమర్శించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బాల్క సుమాన్ డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క కింద కూర్చున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం