TSPSC Group 3 Exam: 3 పేపర్లు, 450 మార్కులు - గ్రూప్ - 3 పరీక్ష విధానం ఇదే-tspsc released syllabus and pattern for group 3 exam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tspsc Released Syllabus And Pattern For Group 3 Exam

TSPSC Group 3 Exam: 3 పేపర్లు, 450 మార్కులు - గ్రూప్ - 3 పరీక్ష విధానం ఇదే

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 02:26 PM IST

TSPSC Group 3 Notification : 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక సిలబస్, పరీక్ష విధానానికి సంబంధించి వివరాలను వెల్లడించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

తెలంగాణ గ్రూప్ 3 నోటిఫికేషన్
తెలంగాణ గ్రూప్ 3 నోటిఫికేషన్

TSPSC Group 3 Exam Syllabus: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. తాజాగా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే సిలబస్ లోని అంశాలు, పరీక్ష విధానానికి సంబంధించిన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని చూస్తే....

మొత్తం 3 పేపర్లు...

గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. బుధవారం ఈ సిలబస్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్పీఎస్సీ. గ్రూప్‌-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

గ్రూప్ 3లోని మొదటి పేపర్ లో జనరల్ నాల్జెడ్ కి సంబంధించి ఉంటుంది. ఇక పేపర్‌-2లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశంపై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి. ఇదే పేపర్‌లో భారత రాజ్యాంగం అంశానికి 50 మార్కులు, భారత చరిత్రకు మరో 50 మార్కులు ఇచ్చారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి 50 మార్కులు ఉంటాయి. పేపర్‌-3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలున్నాయి. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు.

ఇక తాజా గ్రూప్ - 3 లో మొత్తం 26 విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. శాఖల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆర్థిక శాఖలో 712 పోస్టులు ఉండగా... ఉన్నత విద్యాశాఖలో 89, హోంశాఖలో 70.. రెవెన్యూ శాఖలో 73.. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 56 పోస్టులు ఉన్నాయి.

2022 లోనే ప్రధాన నోటిఫికేషన్లన్నీ జారీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. వరసు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ 9,168 పోస్టులతో డిసెంబర్ 1న గ్రూప్ - 4 నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ - 2 నోటిఫికేషన్ ను డిసెంబర్ 29న ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 శాఖల్లో 783 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IPL_Entry_Point