TSPSC Group 3 Notification : 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ.. అత్యధిక పోస్టులు ఆ శాఖలోనే...-tspsc releases group 3 notification for 1365 posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 3 Notification : 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ.. అత్యధిక పోస్టులు ఆ శాఖలోనే...

TSPSC Group 3 Notification : 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ.. అత్యధిక పోస్టులు ఆ శాఖలోనే...

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 06:58 PM IST

TSPSC Group 3 Notification : 1,365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల
గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల

TSPSC Group 3 Notification : TSPSC Group 3 Notification: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. తాజాగా... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 4, గ్రూప్ 2 రాతపరీక్షలు పూర్తయిన తర్వాత గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

గ్రూప్ - 3 లో మొత్తం 26 విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. శాఖల వారీగా చూస్తే.. అత్యధికంగా ఆర్థిక శాఖలో 712 పోస్టులు ఉండగా... ఉన్నత విద్యాశాఖలో 89, హోంశాఖలో 70.. రెవెన్యూ శాఖలో 73.. సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 56 పోస్టులు ఉన్నాయి. అన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులే అధికంగా ఉండటం గమనార్హం. రోస్టర్ ల వారీగా ఖాళీలు, అర్హతలు, వయసు, స్కేల్ ఆఫ్ పే తదితర వివరాలు జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని సూచించింది.

శాఖల వారీగా పోస్టుల సంఖ్య…

గ్రూప్ 3 పోస్టులు
గ్రూప్ 3 పోస్టులు

2022 లోనే ప్రధాన నోటిఫికేషన్లన్నీ జారీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం.. వరసు నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ 9,168 పోస్టులతో డిసెంబర్ 1న గ్రూప్ - 4 నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గ్రూప్ - 2 నోటిఫికేషన్ ను డిసెంబర్ 29న ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 శాఖల్లో 783 పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా... గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువరించిన టీఎస్పీఎస్సీ... నూతన సంవత్సరం ముందు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

మిగిలిన అన్ని రకాల పోస్టుల మాదిరిగానే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు కూడా ఇంటర్యూ పద్ధతిని రద్దు చేసింది ప్రభుత్వం. దీంతో.. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులని ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని టీఎస్పీఎస్సీ అంచనా వేస్తోంది. మరోవైపు.. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలను కూడా రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం.. గ్రూప్ 1 మెయిన్ పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉంది.

Whats_app_banner