TRS Strategy : ఎస్సీ, ఎస్టీ స్థానాలపై టీఆర్ఎస్ కన్ను.. క్లీన్ స్వీప్ చేస్తుందా?
TRS On Next Election : వచ్చే ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాలపై కన్నేసినట్టుగా కనిపిస్తోంది. వరుసగా.. ఎస్సీ, ఎస్టీ అనుకూల నిర్ణయాలతో ముందుకెళ్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాలపై టీఆర్ఎస్(TRS) కన్నేసింది. ముఖ్యమంత్రి ప్రకటించిన 'ఎస్సీ, ఎస్టీ అనుకూల నిర్ణయాల'తో రిజర్వ్ స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంపై టీఆర్ఎస్ గురిపెట్టింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31 రిజర్వ్‌డ్ కాగా, అందులో ఎస్సీలు 19, ఎస్టీలు 12 ఉన్నాయి. 2018లో టీఆర్‌ఎస్ 16 ఎస్సీ, ఆరు ఎస్టీ స్థానాలను గెలుచుకుంది. అనంతరం ఇతర పార్టీల నుండి ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎస్టీ శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ(Telangana Assembly)లో మొత్తం 18 ఎస్సీ, 10 ఎస్టీ స్థానాలకు టీఆర్ఎస్ చేరుకుంది.
KCR On Next Election : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నక్రేకల్, ఖమ్మం జిల్లాల్లోని సత్తుపల్లి, మధిర ఎస్సీ స్థానాలు. ఇక్కడ టీఆర్‌ఎస్ ఓడిపోయింది. ఎస్టీ రిజర్వ్ స్థానాలైన వైరా, అశ్వారావుపేట, యెల్లందు, భద్రాచలం, పినపాకలోనూ ఓటమి చూసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా ములుగు సీటును కూడా కోల్పోయింది. అయితే నక్రేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వైరా శాసనసభ్యుడు రాములునాయక్, సత్తుపల్లి, అశ్వారావుపేట టీడీపీ(TDP) ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ఆ వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు.
KCR Concentrate On SC ST Reserved seats : యెల్లందు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, రేగాకాంతరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ములుగు, మధిర, భద్రాచలం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.
సెప్టెంబర్ 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో 1500 కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్, బంజారా భవన్‌లను ఎస్టీలకు ఉచితంగా నిర్వహించేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించారు.
ST Reservations : ఎస్టీలకు నాలుగు శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంపుదల, భూమిలేని ఎస్టీలకు గిరిజన బంధు, గిరిజనులకు పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని టీఆర్‌ఎస్ ప్రకటిచింది. తెలంగాణ నూతన సచివాలయ సముదాయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును కూడా ముఖ్యమంత్రి పెట్టారు.
KCR Strategy : ఇటీవల ఎస్సీ, ఎస్టీల అనుకూల నిర్ణయాలపై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మద్దతు కూడగట్టేందుకు మరో రెండు వారాల పాటు నియోజకవర్గాల్లో సంబరాలను ప్లాన్ చేసుకున్నారు. కృతజ్ఞతగా ర్యాలీలు తీయడంతోపాటు 'క్షీరాభిషేకాలు' చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా.. ఎస్సీ, ఎస్టీ స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలని టీఆర్ఎస్ గట్టి ప్లాన్ వేసినట్టుగా అర్థమవుతోంది.
సంబంధిత కథనం