TGSRTC Jobs : ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభం -ఉద్యోగార్థులకు కీలక అలర్ట్ ఇచ్చిన ఎండీ సజ్జనార్-tgsrtc md sajjanar key press note about recruitment links ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Jobs : ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభం -ఉద్యోగార్థులకు కీలక అలర్ట్ ఇచ్చిన ఎండీ సజ్జనార్

TGSRTC Jobs : ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభం -ఉద్యోగార్థులకు కీలక అలర్ట్ ఇచ్చిన ఎండీ సజ్జనార్

TGSRTC Recruitment 2024 : ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు. ఆన్ లైన్ లో సర్కులేట్ అవుతున్న కొన్ని లింకులను నమ్మవద్దని కోరారు.

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు

TGSRTC Recruitment 2024 : ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సంస్థ ఎండీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 3,035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును TGSRTC ప్రారంభించిందని సజ్జనార్ తెలిపారు. “3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్ లను ఉద్యోగార్థులు నమ్మవద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దు” అని ఓ ప్రకటనలో కోరారు.

ఆర్టీసీలోని ఖాళీలపై భర్తీపై ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.  టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులు భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పోస్టులు వివరాలను టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రకటించింది.

పోస్టులు వివరాలు

  • డ్రైవర్ పోస్టులు-2000
  • శ్రామిక్ -743
  • డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్)-114
  • డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్)-84
  • డీఎం/ఏటీఎం/మెకానిక్ ఇంజినీర్-40
  • అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)-23
  • మెడికల్ ఆఫీసర్-14
  • సెక్షన్ ఆఫీసర్(సివిల్)-11
  • అకౌంట్స్ ఆఫీసర్-6
  • మెడికల్ ఆఫీసర్(జనరల్, స్పెషలిస్ట్)-14.

టీజీఎస్‌ఆర్టీసీలో 3035 కొలువులు భర్తీ చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి ఎక్స్ లో పోస్టు చేశారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామన్నారు. 

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు బలోపేతం చేసేందుకు ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో రద్దీ పెరిగిందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు వివరించారు. త్వరలో 3035 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.