Revanth Reddy: నైపుణ్యాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ స్కిల్ యూనివర్సిటీ, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కోర్సులు-సీఎం రేవంత్ రెడ్డి-hyderabad cm revanth reddy review on skill university set up at gachibowli esci ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: నైపుణ్యాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ స్కిల్ యూనివర్సిటీ, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కోర్సులు-సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నైపుణ్యాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ స్కిల్ యూనివర్సిటీ, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కోర్సులు-సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Jul 08, 2024 07:21 PM IST

CM Revanth Reddy : యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలన్నారు.

నైపుణ్యాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ‘స్కిల్ యూనివర్సిటీ’ - సీఎం రేవంత్ రెడ్డి
నైపుణ్యాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ‘స్కిల్ యూనివర్సిటీ’ - సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ యువత నైపుణ్య శిక్షణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తుండగా, నైపుణ్యాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ గా భావిస్తోన్న 'స్కిల్ యూనివర్సిటీ' ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నింటికి అందుబాటులో ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ

ఈఎస్సీఐలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ ను సోమవారం మధ్యాహ్నం పరిశీలించిన అనంతరం అక్కడే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చర్చించారు. అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా లభించేలా స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని సీఎం సూచించారు. స్కిల్ వర్సిటీ ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి అంశాలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని అధికారులకు చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం