National Merit Scholarship : ఇంటర్ మెరిట్ విద్యార్థులకు నేషనల్ స్కాలర్ షిప్, దరఖాస్తుకు డిసెంబర్ 31 లాస్ట్ డేట్
National Merit Scholarship : ఈ ఏడాది ఇంటర్ పాసైన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
National Merit Scholarship : ఈ ఏడాది మార్చిలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు మెరిట్ స్కాలర్ షిప్ పొందే సదవకాశం వచ్చింది. ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. మెరిట్ స్కాలర్ షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ప్రకటించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. కొత్త విద్యార్థులతో పాటు గతంలో ఈ స్కాలర్ షిప్ పొందిన కూడా డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
డిసెంబర్ 31 వరకు గడువు
ప్రభుత్వ కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెంట్రల్ సెక్టార్ స్కాలర్ షిప్ పథకం, నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు డిసెంబర్ 31 వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు https://scholarships.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టాప్ 20 పర్సంటైల్ సాధించిన అభ్యర్థుల జాబితాను https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.