TS Inter Results 2024 : విద్యార్థులకు బిగ్ అప్డేట్... ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!-telangana inter results 2024 are likely to be released on april 22 check latest updates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 : విద్యార్థులకు బిగ్ అప్డేట్... ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!

TS Inter Results 2024 : విద్యార్థులకు బిగ్ అప్డేట్... ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 20, 2024 11:51 AM IST

TS Inter Results 2024 Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాల(TS Inter Results) విడుదలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఏప్రిల్ 22వ తేదీన ప్రకటించనున్నట్లు సమాచారం.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు - 2024
తెలంగాణ ఇంటర్ ఫలితాలు - 2024

TS Inter Results 2024 Date: తెలంగాణ ఇంటర్ ఫలితాల(TS Inter Results) విడుదలు రాబోతున్నాయి. ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్(Inter Spot Valuation) పూర్తి కావటంతో మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తుాన్నారు. ఏప్రిల్ 22వ(సోమవారం) తేదీన రిజల్ట్స్ ను(TS Inter Results Date) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ తేదీ కుదరకపోతే 25వ తేదీలోపు దాదాపుగా ప్రకటించవచ్చు. ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు(Telangana Intermediate Board Results) అధికారికంగా ప్రకటన చేయనుంది.

9 లక్షల మందికిపైగా విద్యార్థులు…

ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్మీడియట్(TS Inter Exams 2024) పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఫలితాలు రావటంతో… తెలంగాణ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయా అని ఎదురుచూస్తున్నారు. TS EAPCET తోపాటు మిగతా ప్రవేశ పరీక్షల దృష్ట్యా… త్వరగా ఫలితాలను ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అధికారులే ఫలితాలను ప్రకటిస్తారు. ఈసీ అనుమతితో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

How To Check TS Inter Results 2024 : HT తెలుగులో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

గతేడాది(2023) మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Exams 2024) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే HT తెలుగు సైట్ లో మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి మీ రిజల్ట్స్ ను చూడొచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/home.do  లోనూ చెక్ చేసుకోవచ్చు మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సెర్చ్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

 

IPL_Entry_Point