TS Inter Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్దం - తాజా అప్డేట్స్ ఇవే-telangana intermediate 1st and 2nd year exam results 2024 live news updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్దం - తాజా అప్డేట్స్ ఇవే

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల అప్డేట్స్

TS Inter Results 2024 Live : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్దం - తాజా అప్డేట్స్ ఇవే

Updated Apr 20, 2024 09:22 PM ISTUpdated Apr 20, 2024 09:22 PM IST
  • Share on Facebook
Updated Apr 20, 2024 09:22 PM IST
  • Share on Facebook

  • Telangana Intermediate Results 2024 Live News: తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. స్పాట్ తో పాటు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసిన అధికారులు… రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. తాజా లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి….

Sat, 20 Apr 202403:52 PM IST

TS Inter Results 2024 Live : ఇంటర్ బోర్డు అధికారులే ఫలితాలు విడుదల చేసే అవకాశం

ఇంటర్ ఫలితాలను సాధారణంగా విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Sat, 20 Apr 202403:44 PM IST

TS Inter Results 2024 Live : సోమ లేదా మంగళవారం ఇంటర్ ఫలితాలు?

 తెలంగాణ ఇంటర్ ఫలితాలను వెల్లడించడానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సోమ లేదా మంగళవారాల్లో ఇంటర్ ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.

Sat, 20 Apr 202402:48 PM IST

TS Inter Results 2024 Live : ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు

తెలంగాణ ఇంటర్ ఫలితాలను త్వరలో ప్రకటించనుంది బోర్డు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో తనిఖీ చేయవచ్చు.

Sat, 20 Apr 202401:40 PM IST

TS Inter Results 2024: గత ఏడాది సెకండియర్ లో 2,95,550 మంది పాస్

2023లో తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలకు 4,65,478 మంది విద్యార్థులు హాజరు కాగా, 2,95,550 మంది విద్యార్థులు (జనరల్ మరియు ఒకేషనల్ విద్యార్థులతో సహా) ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.

Sat, 20 Apr 202401:03 PM IST

TS Inter Results 2024: SMS ద్వారా ఇంటర్ ఫలితాలు ఎలా తనిఖీ చేయాలి?

 ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల కోసం– TSGEN2 అని 56263 కు SMS పంపండి. 

వొకేషనల్ ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల కోసం- TSVOC2 అని 56263కి SMS పంపండి. 

ఇంటర్ 1వ సంవత్సరం ఫలితాల కోసం- TSGEN1 అని 56263 కు SMS పంపండి. 

వొకేషనల్ 1వ సంవత్సరం ఫలితాల కోసం- TSVOC1 అని 56263కి SMS పంపండి.

Sat, 20 Apr 202412:20 PM IST

TS Inter Results 2024 Live : టీఎస్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే వెబ్ సైట్లు

 telugu.hindustantimes.com/telangana-board-result 

tsbie.cgg.gov.in 

results.cgg.gov.in 

manabadi.com 

results.gov.in

Sat, 20 Apr 202411:30 AM IST

TS Inter Results 2024 Live : ఇంటర్ ఫలితాల ప్రకటన తేదీ?

 తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ, సమయానికి సంబంధించి అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. ఈ నెల 22 లేదా 23న ఫలితాలు రానున్నాయని సమాచారం.

Sat, 20 Apr 202410:53 AM IST

TS Inter Results 2024 Live : 2023లో తగ్గిన ఇంటర్ సెకండియర్ పాస్ పర్సెంటేజ్

  2023లో టీఎస్ ఇంటర్ రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 63.49 శాతం కాగా 2022లో 67.16 శాతం ఉంది.

Sat, 20 Apr 202409:50 AM IST

TS Inter Results 2024 Live : ఇంటర్ ఫలితాల స్కోర్‌కార్డ్‌లో చూడవలసిన వివరాలు

విద్యార్థి పేరు రోల్ నంబర్ 

అడ్మిట్ కార్డ్ నంబర్ 

పుట్టిన తేదీ 

సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు 

మొత్తం శాతం

Sat, 20 Apr 202409:16 AM IST

TS Inter Results 2024 Live : ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది విద్యార్థులు

ఫిబ్రవరి 28, మార్చి 18 మధ్య టీఎస్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరిగాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.

Sat, 20 Apr 202408:03 AM IST

క్షణాల్లోనే ఫలితాలు….

తెలంగాణ ఇంటర్ ఫలితాలను https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి సింపుల్ గా తెలుసుకోవచ్చు.

Sat, 20 Apr 202407:52 AM IST

తేదీలపై ప్రకటన

ఏ క్షణమై తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీలను ప్రకటించనుంది ఇంటర్ బోర్డు. అందుకు తగ్గట్టుగా ఫలితాలను వెల్లడించనుంది.

Sat, 20 Apr 202406:23 AM IST

22న ఫలితాలు..!

తెలంగాణ ఇంటర్ ఫలితాల(TS Inter Results) విడుదలు రాబోతున్నాయి. ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్(Inter Spot Valuation) పూర్తి కావటంతో మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తుాన్నారు. ఏప్రిల్ 22వ(సోమవారం) తేదీన రిజల్ట్స్ ను(TS Inter Results Date) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Sat, 20 Apr 202405:15 AM IST

HT తెలుగులో ఇంటర్ సెకండ్ ఇయర్ డైరెక్ట్ లింక్…

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రూల్ నెంబర్ ఎంట్రీ చేసి డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు.

Sat, 20 Apr 202405:14 AM IST

HT తెలుగు డైరెక్ట్ లింక్

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను రూల్ నెంబర్ ఎంట్రీ చేసి చెక్ చేసుకోవచ్చు.

Sat, 20 Apr 202405:08 AM IST

ఇంటర్ బోర్డు సైట్ లోనూ ఫలితాలు….

ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు సైట్ https://tsbie.cgg.gov.in/home.do  లోనూ చెక్ చేసుకోవచ్చు.

Sat, 20 Apr 202405:08 AM IST

9 లక్షల మందికిపైగా విద్యార్థులు….

ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 

Sat, 20 Apr 202405:07 AM IST

ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ రిజల్ట్స్ లింక్

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ రిజల్ట్స్ కోసం https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result-2024  లింక్ పై కిక్ చేయండి.

Sat, 20 Apr 202405:07 AM IST

ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ లింక్

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్ కోసం https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024  లింక్ పై క్లిక్ చేయండి.  

Sat, 20 Apr 202405:07 AM IST

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల లింక్ 

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result-2024  లింక్ పై క్లిక్ చేయండి.

Sat, 20 Apr 202405:06 AM IST

ఫస్ట్ ఇయర్ ఫలితాల లింక్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024  లింక్ పై క్లిక్ చేయాలి.

Sat, 20 Apr 202405:06 AM IST

హెచ్ టీ తెలుగులో ఇంటర్ ఫలితాలు

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ పరీక్షల(TS Inter Exams 2024) ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే HT తెలుగు సైట్ లో మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-result  లింక్ పై క్లిక్ చేసి మీ రిజల్ట్స్ ను చూడొచ్చు.

Sat, 20 Apr 202405:06 AM IST

ఈసీ అనుమతితో ఫలితాలు

ఇప్పటికే అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తి కావటంతో ఈసీ అనుమతితో ఫలితాలను ప్రకటించనున్నారు.

Sat, 20 Apr 202405:05 AM IST

అంతా సిద్ధం

ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను(Telangana Inter Spot Valuation 2024) పూర్తి చేశారు ఇంటర్ అధికారులు. అయితే సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చననట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫలితాలను ప్రకటించేందుకు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

Sat, 20 Apr 202405:05 AM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు…

తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. స్పాట్ తో పాటు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసిన అధికారులు… రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.