TG DSC Hall Tickets 2024 : టీచర్ అభ్యర్థులకు అలర్ట్... డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-telangana dsc hall tickets 2024 released at https tsdsc aptonline in tsdsc direct link here for admit cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Hall Tickets 2024 : టీచర్ అభ్యర్థులకు అలర్ట్... డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG DSC Hall Tickets 2024 : టీచర్ అభ్యర్థులకు అలర్ట్... డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 11, 2024 08:36 PM IST

TG DSC Hall Tickets 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జులై 18 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల 2024
తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల 2024

TG DSC Hall Tickets 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయ్…! దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జులై 18వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమై ఆగస్టు 5వ తేదీవ తేదీతో ముగియనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు.

డీఎస్సీ హాల్ టికెట్లను ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ Payment Reference ID ఎంట్రీ చేయటం లేదా ఆధార్ నెంబర్, Category of the Postతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • హాల్ టికెట్ ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో హాల్ టికెట్ కీలకం.

జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింద "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

ఖాళీల వివరాలు…

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుంది విద్యాశాఖ. ఇందుకోసం 2,79,966 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వచ్చాయి. మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.

జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు. డీఎస్సీ పరీక్షల కోసం అభ్యర్థుల నుంచి ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్త అప్లికేషన్లు వచ్చాయి.

Whats_app_banner