TG DSC Hall Ticket 2024 : రేపు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల - 18 నుంచే పరీక్షలు ప్రారంభం-telangana dsc exam hall tickets 2024 can be downloaded from 11th july ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Hall Ticket 2024 : రేపు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల - 18 నుంచే పరీక్షలు ప్రారంభం

TG DSC Hall Ticket 2024 : రేపు డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల - 18 నుంచే పరీక్షలు ప్రారంభం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 10, 2024 09:44 AM IST

TG DSC Hall Ticket 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు రేపట్నుంచే (జులై ) అందుబాటులోకి రానున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ వెల్లడించింన సంగతి తెలిసిందే.

తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు 2024
తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు 2024

TG DSC Hall Ticket 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఓవైపు పలువురు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుండగా… షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జులై 11వ తేదీ నుంచి వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి.

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 5వ తేదీవ తేదీతో ముగియాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రేపు సాయంత్రం 5గంటల తర్వాత https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డిఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింద "ఆన్‌లైన్"‌లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ పరీక్షలో జనరల్ నాల్డెజ్, టీచింగ్ తో పాటు సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్(TS TET ) వెయిటేజ్ ఉంటుంది. రాతపరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనుంది విద్యాశాఖ. ఇందుకోసం 2,79,966 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వచ్చాయి. జులై 18న మొదటి షిఫ్ట్‌ లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్షను నిర్వహిస్తారు.

జులై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు నిర్వహిస్తారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

మొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి.

డీఎస్సీ పరీక్షల కోసం అభ్యర్థుల నుంచి ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఈసారి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయి.గతంతో పోల్చితే దరఖాస్తులకు అదనంగా మరో లక్షమంది కొత్త అప్లికేషన్లు వచ్చాయి.

Whats_app_banner