TS SSC Results 2024 : ఈసారి మెమోలపై 'పెన్' నెంబర్ - తెలంగాణ పదో తరగతి ఫలితాల తాజా అప్డేట్ ఇదే
Telangana SSC News : తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్పాట్ ప్రక్రియ పూర్తిగా…ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ జరుగుతోంది. అయితే ఈసారి మార్కుల మెమోపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ను ముద్రించనున్నారు.
Telangana 10th class results 2024: తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results 2024) ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు… త్వరలోనే ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకనం పూర్తి కావటంతో…. మార్కుల క్రోడీకరణ కొనసాగింపుతో పాటు పలు సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు అన్నింటిని పరిశీలించిన తర్వాతే ఫలితాలను విడుదల చేయనున్నారు. కీలకమైన స్పాట్ ముగియటంతో…. ఈ వారం రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెమోలపై పెన్ నెంబర్….!
PEN on SSC certificates: మరోవైపు తొలిసారిగా తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్(Permanent Education Number) నెంబర్ ను ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధాానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది. పెన్ నెంబర్(Permanent Education Number) సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. పెన్(Permanent Education Number) నెంబర్ ఆధారంగా… ఒరిజినల్ సర్టిఫికెట్లనుగా సింపుల్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.
నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా…. పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (PEN) అనేది భారతదేశంలోని విద్యార్థులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా కేటాయిస్తున్నారు. PEN అనేది ఒకటో తరగతి అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థికి కేటాయించిన ఒక విశిష్ట సంఖ్య. ఆ సంఖ్య వారి చదువు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం UDISE+ పోర్టల్ ద్వారా విద్యార్థులందరికీ దీన్ని అందిస్తోంది. ఈ PEN ప్రారంభ సంవత్సరంలోనే ఇవ్వబడుతుంది మరియు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడీ తరహాలో నంబర్‌ను కేటాయిస్తారు.ఈ నంబర్ ద్వారా విద్యార్థి ఎక్కడ చదివారో.. ఉన్నత చదువులు తర్వాత ఏ స్థాయిలో ఉన్నారనేది సింపుల్ గా తెలుసుకునే వీలు ఉంటుంది.
How to Check TS SSC Results 2024 : HT తెలుగులో పదో తరగతి ఫలితాలు
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో తెలంగాణ పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క క్లిక్ తో మీ మార్కుల జాబితా డిస్ ప్లే అవుతుంది. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి..
- తెలంగాణ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేయాలి.
- హోంపేజీలో కనిపించే https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ మార్కుల వివరాల కాపీని పొందవచ్చు.
మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org/ లోకి వెళ్లి కూడా ఫలితాలను చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.
ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.