AP SSC Results 2024 Updates : పూర్తి కావొచ్చిన కసరత్తు - ఆ తేదీనే ఏపీ పదో తరగతి ఫలితాలు...!
AP 10th Results 2024 Updates: ఏపీలో పదో తరగతి ఫలితాల(AP SSC Results) విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కాగా…. సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఫలితాల విడుదలకు ప్రాథమికగా ఓ తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.
AP SSC Result 2024 Updates: ఏపీలో ఇంటర్ ఫలితాలు(AP Inter Results) రావటంతో… ఇక పదో తరగతి ఫలితాల(AP SSC Result 2024) కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి వార్షిక పరీక్షలు హాజరయ్యారు. వీరంతా కూడా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్పాట్ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయగా….మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలిసింది. అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫలితాలను విడుదల చేయాలని భావిస్తోంది ఏపీ ఎస్ఎస్సీ బోర్డు.
ఏప్రిల్ 25న ఫలితాలు…?
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే ఫలితాలను విడుదల చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా మారింది. మొన్నటి ఇంటర్ ఫలితాలను కూడా ఇదే విధంగా ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ పదో తరగతి ఫలితాల విషయంలోనూ ఈసీ నుంచి అనుమతి తీసుకోనుంది. అయితే ఫలితాల విడుదల కోసం ఏప్రిల్ 25వ తేదీని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈలోపు అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాలని ఎస్ఎస్ సీ బోర్డు భావిస్తోంది. ఏప్రిల్ 25వ తేదీ కుదరకపోతే… ఏప్రిల్ 30వ తేదీలోపు దాదాపు ప్రకటించే అవకాశం ఉంది. ఎస్ఎస్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/ లో విద్యార్థులు రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
How to Check AP SSC Results 2024 : ఏపీ టెన్త్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు…
- హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో ఏపీ పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సింగిల్ క్లిక్ తో మీ మార్కులను చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి…
- ఏపీ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ‘2024 ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్‌సి పదో తరగతి రిజల్ట్ 2024’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే మీ మార్కులు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ అనే ఆప్షన్ పై నొక్కి మీ ఫలితాల కాపీని పొందవచ్చు.
NOTE : https://telugu.hindustantimes.com/andhra-pradesh-ap-ssc-10th-result-2024 ఈ లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్ గా మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం… అప్పుడు ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తి అయ్యాయి. కానీ ఈసారి మాత్రం…. మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. దీంతో గతంతో పోల్చితే ఈసారి ముందుగానే ఫలితాలు రానున్నాయి. ఈసారి పరీక్షల కోసం 3,473 కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.
సంబంధిత కథనం