KCR : 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య, ఎందుకొచ్చిందీ దుస్థితి- కేసీఆర్
KCR : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులకు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితి ఎందుకొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్ ఉండేదని ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు.
KCR : ధాన్యం ఉత్పత్తిలో(Paddy Production) దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోయే దుస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Chief KCR) ప్రశ్నించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటించిన కేసీఆర్(KCR)... రైతులను పరామర్శించారు. అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ (Congress)అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు.
రైతులకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?
ప్రభుత్వం ముందుగా నీళ్లు (Water Crisis)ఇస్తామని చెప్పిందని అందుకే రైతులు పంటలు వేశారని, ఇప్పుడు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. పంటలు ఎండిపోయి చాలాచోట్ల రైతులు(Farmers) కన్నీరు మున్నీరై విలపిస్తున్నారన్నారు. పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, తగిన పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదనే ఉద్దేశంతో పనిచేసిందన్నారు. అందుకే రైతులకు ముందుగా సాగునీళ్లు అందించామని, పెట్టుబడి సాయం రైతు బంధు సమయానికి ఇచ్చామన్నారు. సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా కరెంట్ అందజేశామన్నారు. గత ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేసిందన్నారు. రైతు బీమాతో పాటు వివిధ అద్భుతమైన విధానాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ తెలిపారు.
100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య
బీఆర్ఎస్(BRS) అధికారంలోకి రాకముందు తెలంగాణలో ఏటా 30, 40 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యేది కాదన్న కేసీఆర్(KCR)... తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులు దాటిందన్నారు. రైతు సంక్షేమ విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ రాష్ట్రానికి పోటీగా నిలిచిందన్నారు. ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఇప్పుడెందుకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి కారణం ఎవరు? లోపం ఎక్కడుందని నిలదీశారు. దీనిపై అందరూ ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన 100 రోజులకే రైతులకు పరిస్థితి ఇంత దుర్భరంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుల సంక్షేమం(Farmers Welfare) కోసం గత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా ఈ దుస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో(Mission Bhagiratha) రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంలో...ఇప్పుడు తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టని ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా నీళ్ల ట్యాంకర్లే కనిపించలేదన్నారు. తాగునీటికి ప్రత్యేకమైన ప్రణాళిక అమలుచేశామన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా నీళ్ల ట్యాంకర్లను(Hyderabad Water Tankers) ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ధ్వజమెత్తారు.
సూర్యాపేటలో కేసీఆర్ ప్రెస్ మీట్ మొదలవ్వగానే కరెంట్ పోయింది. ఆ తర్వాత కాసేపటికే కరెంట్ వచ్చింది. కాంగ్రెస్ పాలన ఇలానే కరెంట్ వస్తూ, పోతూ ఉంటుందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
సంబంధిత కథనం