Platform Ticket Price Hike : రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంపు -south central railway hikes platform ticket price ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Hikes Platform Ticket Price

Platform Ticket Price Hike : రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంపు

HT Telugu Desk HT Telugu
Sep 26, 2022 09:22 PM IST

South Central Railway : రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

కాచిగూడ రైల్వే స్టేషన్
కాచిగూడ రైల్వే స్టేషన్ (twitter)

నేటి నుంచి అక్టోబర్ 9 వరకు రైల్వే ప్లాట్ ఫాం ధరలు పెంచుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల బంధువులు కూడా ఎక్కువ వస్తుంటారు. రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు అమలు కానున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. . కాచిగూడ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ. 20కి పెంచారు.

South Central Railway Special Trains :హైదరాబాద్ - యశ్వంతపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించారు. ఈ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 25, 27 వ తేదీల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 09.5 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ కు చేరుతుంది.

ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం 03.50 నిమిషాలకు స్పెషల్ ట్రైన్ బయల్దేరి... మరునాడు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

ఈ ట్రైన్ సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.

nanded puri special train: నాందేడ్ - పూరీ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. సెప్టెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 03.25 గంటలకు నాందేడ్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 05. 30 గంటలకు పూరీకి చేరుకుంటుంది. ఇక పూరీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీన రాత్రి 10.45 గంటలకు బయల్దేరుతుంది. రెండోరోజు అర్ధరాత్రి 1 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ ముద్ ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరూ, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బెరంపూర్, ఖుర్దా స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లల్లో 2ఏసీ, 3ఏసీ, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

IPL_Entry_Point