Tirupati Special Trains: సికింద్రాబాద్, తిరుపతి, నాందేడ్ కు ప్రత్యేక రైళ్లు
Tirupati Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది ఈ వివరాలను చూస్తే....
secundrabad tirupati trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. సెప్టెంబర్ 22వ తేదీన సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 05.50 నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.20 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.
ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 23వ తేదీన రాత్రి 08.20 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.20 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ జనగాం, కాజీపపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.
మరోవైపు సికింద్రాబాద్ – సుబేదార్‌గంజ్, నాందేడ్ – తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.