Secunderabad Ruby Hotel Fire: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో నలుగురు అరెస్ట్-police arreted four accused in the secunderabad ruby hotel fire accident case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Secunderabad Ruby Hotel Fire: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో నలుగురు అరెస్ట్

Secunderabad Ruby Hotel Fire: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో నలుగురు అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 11:22 AM IST

Ruby Hotel Fire Accident: సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కి తీసుకున్నారు. ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న నలుగురు నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేశారు.

<p>నలుగురు అరెస్ట్</p>
నలుగురు అరెస్ట్ (twitter)

secunderabad ruby hotel fire accident case: సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో రంజిత్‌ సింగ్‌, సుమిత్‌ సింగ్‌తోపాటు మేనేజర్‌, సూపర్‌వైజర్‌ ఉన్నారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు మేడ్చల్‌ ఫాంహౌస్‌లో తలదాచుకున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్‌ చేశారు.

ఏం జరిగిందంటే...?

secunderabad fire accident: సోమవారం(సెప్టెంబర్ 13) సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 9.40గంటలకు లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో బస చేసిన వారు పొగలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. లాడ్జి చుట్టూ భారీ భవనాలు ఉండటంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయారు. ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మరణించగా మరో నలుగురు ఆస్పత్రిలో చనిపోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ఐదంతస్తుల రూబీ లాడ్జి కింద ఫ్లోర్లలో ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్‌తో పాటు గోడౌన్ నిర్వహిస్తున్నారు.

మృతులు 35-40ఏళ్లలోపు వయసు ఉన్న వారిగా గుర్తించారు. చనిపోయిన వారిలో విజయవాడకు చెందిన ఏ.హరీశ్‌, చెన్నైకు చెందిన సీతరామన్‌, ఢిల్లీకి చెందిన వీతేంద్రలు ఉన్నారు. గాయాల పాలైన వారిలో విశాఖపట్నానికి చెందిన యోగిత అనే యువతి ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల షోరూమ్‌ పై భాగంలో లాడ్జి ఉంది. షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో పైన లాడ్జికి మంటలు వ్యాపించాయి. భవనం కింద నుంచి దట్టమైన పొగలు వేగంగా హోటల్లోకి వ్యాపించాయి. లాడ్జి గదుల్లోకి పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోయారు. దట్టమైన పొగ వేగంగా వ్యాపించడంతో అందులో ఉన్న వారు బయటకు రాలేకపోయారు. పొగను పీల్చి చాలామంది స్పృహ కోల్పోయారు.

ప్రమాదం జరిగిన సమయంలో రూబీ లాడ్జిలో 25మంది పర్యాటకులు బస చేశారు. వివిధ పనుల కోసం నగరానికి వచ్చిన వారు ‍హోటల్ గదుల్లో ఉన్నారని హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు తెలపడంతో వెంటనే అప్రమత్తమై వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. హోటల్‌పైకి వెళ్లేందుకు వీల్లేకపోవడంతో భారీ క్రేన్‌ను ఘటనాస్థలికి రప్పించారు. హోటల్ గదుల్లో ఉన్న రక్షించాలని కేకలు పెట్టారు. మంటలు అదుపులోకి వచ్చాక లోపలకు వెళ్ళిన సిబ్బందికి కారిడార్లు, గదుల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న పర్యాటకులు కనిపించారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో శ్వాస అందక ఏడుగురు పర్యాటకులు చనిపోయారు.

Whats_app_banner