IND Vs AUS Ticket Price : ఉప్పల్ స్టేడియంలో రూ.850 టికెట్.. రూ.11000కు-ind vs aus t20 match 3 members arrest for selling black tickets near uppal stadium ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ind Vs Aus Ticket Price : ఉప్పల్ స్టేడియంలో రూ.850 టికెట్.. రూ.11000కు

IND Vs AUS Ticket Price : ఉప్పల్ స్టేడియంలో రూ.850 టికెట్.. రూ.11000కు

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 06:10 PM IST

IND Vs AUS Match : ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లకు సంబంధించి ఇటీవల వివాదమైంది. అయితే తాజాగా స్టేడియం సమీపంలో కొంతమంది బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. భారీ ధరకు విక్రయిస్తున్నారు.

రాజీవ్ గాంధీ స్టేడియం(ఫైల్ ఫొటో)
రాజీవ్ గాంధీ స్టేడియం(ఫైల్ ఫొటో) (PTI)

ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్ లో టిక్కెట్లను కొంతమంది విక్రయిస్తున్నారు. గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.850 టిక్కెట్, రూ.11000లకు అమ్ముతుండగా పట్టుకున్నారు. ఆరు టిక్కెట్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

గాయపడిన వారికి ఫ్రీ

ఇటీవల జింఖానా మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య T 20 మ్యాచ్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. వారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ఈలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అనంతరం గాయపడిన వారికి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ ను ఉచితంగా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. తొక్కిసలాటలో గాయపడి ఊపిరి ఆడక ఇబ్బంది పడిన వారికి వారికి సత్వర సాయంగా తన CPR అందించిన బేగంపేట కానిస్టేబుల్ లు నవీనకు పదోన్నతి, మరో కానిస్టేబుల్ విమలకు రివార్డు ను అందించాలని హైదరాబాద్ కమిషనర్ కు సిపార్సు చేశారు శ్రీనివాస్ గౌడ్.

ఈ మ్యాచ్‌ కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం గమనార్హం. సొంత వాహనాల్లో వచ్చి ఇబ్బందులు పడటం ఎందుకు.. మా బస్సుల్లో ప్రయాణించండి అంటూ ఆర్టీసీ తన అధికారిక ట్విటర్‌లో ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఎక్కడి నుంచి ఏయే బస్సులు స్టేడియానికి చేరుకుంటాయన్న ప్రత్యేక ఛార్ట్‌ను కూడా ట్వీట్‌ చేసింది. దీనిని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేయగా.. టీఎస్‌ ఆర్టీసీ రీట్వీట్‌ చేసింది. "క్రికెట్‌ చూడటానికి సొంత బండి తీసుకెళ్లి గంటల తరబడి పార్కింగ్‌లో వేచి చూడటం అవసరమా? క్రికెట్‌ మీరు ఆస్వాదించండి. మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత మాది" అంటూ ఈ ప్రత్యేక బస్సుల విషయాన్ని వెల్లడించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం