high tension at gymkhana ground: భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. గురువారం ఉదయం టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. మూడు వేల టికెట్ల కోసం 30వేల మందికి పైగా అభిమానులు తరలిరావటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
India-Australia Match Tickets: మహిళలు కూడా టికెట్స్ కోసం భారీగా క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాటు.. టికెట్ల కోసం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అలాగే తొక్కిలసలాటలో పలువురు అభిమానులు గాయపడగా... పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
కాగా మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు అర్ధర్రాతి నుంచే క్యూ లైన్లలో బారులుతీరారు. పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా మైదానం వద్దకు తరలివచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే నలుగురు త్రీవంగా గాయపడినట్లు తెలుస్తోంది. వర్షం కూడా పడటంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
జింఖానా ఘటన వద్ద గాయపడిన మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని నగర పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అలాంటిదేమీ జరగలేదన్నారు.