TSRTC Cares : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ వైద్య సేవలు
TSRTC Updates : ప్రయాణికులకు దగ్గర అయ్యేందుకు కొత్త కొత్త నిర్ణయాలతో ఆర్టీసీ ముందుకొస్తుంది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ప్రయాణికులకు చేరువయ్యేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. మీ ప్రయాణం సమయంలో కలిగే ప్రతి అసౌకర్యానికి అడ్డుంటాం.. మీ సురక్షిత ప్రయాణంలో ప్రతి క్షణం తోడుంటాం అని టీఎస్ఆర్టీసీ చెబుతోంది. ఈ మేరకు ప్రయాణికుల ఆరోగ్య సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
TSRTC Runs Special Buses For Dasara : మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పంది తెలంగాణ ఆర్టీసీ. ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నిర్ణయించింది.
బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై దృష్టిపెట్టింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రంగారెడ్డి రీజయన్ నుంచి దాదాపు 3వేలకుపైగా ఆర్టీసీ బస్సులను దసరా స్పెషల్స్‌గా జిల్లాలకు నడిపించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.
నగరంలోని జేబీఎస్, సికింద్రాబాద్, మియాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, కోఠి వంటి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్ బస్సులు నడుపుతారు. బతుకమ్మ, దసరా నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊర్లకు వెళ్లడం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు.
Hyderabad TSRTC Buses: ఐటీ ఉద్యోగాలు, కోకాపేట్ సెజ్ వైపు వెళ్లేవారికి టీఎస్‌ఆర్‌టీసీ శుభవార్త చెప్పింది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ కొత్త బస్సుల వివరాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. బస్సులు కోటి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టిప్పుఖాన్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నరిసింగి మీదుగా నడుస్తాయి. మొదటి బస్సు ఉదయం 6:00 గంటలకు దిల్‌సుఖ్‌నగర్ నుండి బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు డిపో నుండి బయలుదేరుతుంది.
సెప్టెంబర్ 10న కొత్త వాహనాలను ప్రవేశపెట్టిన ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, దిల్‌సుఖ్‌నగర్-కోకాపేట్ మార్గంలో రద్దీని తగ్గించడానికి ప్రతి 40 నిమిషాలకు బస్సులను నడుపుతుంది. మరిన్ని వివరాల కోసం 040-23450033/69440000 నంబర్లలో TSRTCని సంప్రదించవచ్చు.