Team India record at Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా రికార్డు ఇదీ-this is team india record at uppal stadium where third and final t20i against australia to be held ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Record At Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా రికార్డు ఇదీ

Team India record at Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా రికార్డు ఇదీ

Hari Prasad S HT Telugu
Sep 24, 2022 08:22 PM IST

Team India record at Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా రికార్డు ఎలా ఉంది? ఆదివారం (సెప్టెంబర్‌ 25) ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ డిసైడర్‌ జరగనున్న నేపథ్యంలో అభిమానుల్లో సహజంగానే తలెత్తే ప్రశ్న ఇది.

హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (PTI)

Team India record at Uppal Stadium: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌ విజేత ఎవరు అన్నది ఆదివారం (సెప్టెంబర్‌ 25) హైదరాబాద్‌లోని ఉప్పల్‌(రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్) స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌ డిసైడ్‌ చేయనుంది. సుమారు మూడేళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌ కావడంతోపాటు దీనికి చాలా ప్రాధాన్యత ఉండటంతో అభిమానుల్లో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

2004లో ఉప్పల్‌ స్టేడియం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకూ రెండు ఇంటర్నేషనల్‌ టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. అయితే ఇందులో 2017లో జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. అది కూడా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచే కావడం గమనార్హం. 2017, అక్టోబర్‌ 13న ఆ మ్యాచ్‌ జరగాల్సింది. అయితే భారీ వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా రికార్డు ఇదీ

ఉప్పల్‌ స్టేడియంలో 2019లో తొలిసారి టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ జరిగింది. డిసెంబర్‌ 6న వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్లతో గెలిచింది. 205 రన్స్‌ టార్గెట్‌ను ఇండియా చేజ్‌ చేయడం విశేషం. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 50 బాల్స్‌లోనే 94 రన్స్‌ చేశాడు. ఇప్పుడు సుమారు మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాతోనే మరో టీ20 మ్యాచ్‌ జరగబోతోంది.

ఇక ఈ స్టేడియం ఇప్పటి వరకూ 6 వన్డేలు, 5 టెస్ట్‌ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది. ఆరు వన్డేల్లో మూడు ఇండియా, ఆస్ట్రేలియా మధ్యే జరిగాయి. ఈ మూడింట్లో ఇండియా ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. ఇక 2013లో ఆస్ట్రేలియాతోనే ఒక టెస్ట్‌ కూడా ఇక్కడ ఆడింది. ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది.

ఉప్పల్‌ స్టేడియంలో టీ20 రికార్డులు ఇవీ

ఇప్పటి వరకూ ఉప్పల్‌ స్టేడియంలో ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ పూర్తిగా జరిగింది. ఆ మ్యాచ్‌లో నమోదైన రికార్డులే ఇవి.

అత్యధిక వ్యక్తిగత స్కోరు - విరాట్‌ కోహ్లి (94 నాటౌట్‌)

బెస్ట్‌ బౌలింగ్‌ - యుజువేంద్ర చహల్‌ (4 ఓవర్లలో 36 రన్స్‌ 2 వికెట్లు)

అత్యధిక పార్ట్‌నర్‌షిప్‌ - కోహ్లి, రాహుల్‌ మధ్య 100 రన్స్‌

అత్యధిక సిక్స్‌లు, ఫోర్లు - విరాట్ కోహ్లి (6 సిక్స్‌లు, 6 ఫోర్లు)

WhatsApp channel