Tamannaah Bhatia: మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో హాట్ పోజుల్లో తమన్నా
- Tamannaah Bhatia: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఆమె తాజాగా గురువారం (ఆగస్ట్ 18) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అవి మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆమె దిగిన ఫొటోలు కావడం విశేషం.
- Tamannaah Bhatia: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఆమె తాజాగా గురువారం (ఆగస్ట్ 18) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అవి మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆమె దిగిన ఫొటోలు కావడం విశేషం.
(1 / 4)
Tamannaah Bhatia: తమన్నా భాటియా ప్రస్తుతం ఆస్ట్రేలియా ట్రిప్‌లో ఉంది. ఈ సందర్భంగా వరల్డ్ ఫేమస్ క్రికెట్ స్టేడియంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు కూడా వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను ఆమె గురువారం (ఆగస్ట్ 18) తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
(2 / 4)
Tamannaah Bhatia: మెల్‌బోర్న్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తమన్నా కనిపించనుంది. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టడంతో ఎంసీజీకి గ్లామర్ లుక్ వచ్చింది. నిజానికి ఫొటోషూట్ కోసం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తమన్నాను ఇన్వైట్ చేసింది.
(3 / 4)
Tamannaah Bhatia: ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న ఎంసీజీలో ఆమె కెమెరాలకు పోజులిచ్చింది. చేతిలో ఓ బ్యాట్ కూడా పట్టుకుంది. ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. అది రాసి ఉన్న బ్యాట్ పట్టుకునే తమన్నా ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోషూట్‌కు తమన్నా ఆరెంజ్ కలర్ డీప్‌నెక్ సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుంది.
(4 / 4)
Tamannaah Bhatia: టాలీవుడ్ వదిలి మెల్లగా బాలీవుడ్ వైపు చూస్తున్న తమన్నా అక్కడి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే ఆమెను మెల్‌బోర్న్ పంపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్ మూవీ రిలీజ్ కానుంది.
ఇతర గ్యాలరీలు