Rashmika Mandanna meets Orthopaedist: హైదరాబాద్ టాప్ ఆర్థోపెడిస్ట్‌ను కలిసిన రష్మిక.. కారణం ఇదే
Rashmika Mandanna meets Orthopaedist: హైదరాబాద్‌లోని టాప్ ఆర్థోపెడిస్ట్‌లలో ఒకరైన డాక్టర్ గురువారెడ్డిని కలిసింది టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఆ డాక్టరే చెప్పారు.

Rashmika Mandanna meets Orthopaedist: టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస ఆఫర్లు కొట్టేస్తున్న పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా.. హైదరాబాద్‌లోని టాప్ ఆర్థోపెడిస్ట్‌లలో ఒకరైన డాక్టర్ గురువారెడ్డిని కలిసిందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. ఇలా ఆర్థోపెడిస్ట్‌ను ఎందుకు కలిసిందన్న ఆందోళన ఫ్యాన్స్‌లో వ్యక్తమైంది.
అయితే ఇప్పుడు ఆమె కలిసిన డాక్టర్ గురువా రెడ్డే దీని వెనుక ఉన్న కారణాన్ని తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వివరించారు. రష్మిక మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు డాక్టర్ గురువారెడ్డి ఆ పోస్ట్‌లో వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన కాస్త ఫన్నీగానే చెప్పారు. "నువ్వు 'సామి..సామి..' అంటూ మోకాళ్ల మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!" అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన 'శ్రీవల్లి'కి సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను.
పుష్ప సినిమా చూసిన మొదలు, రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో భుజం నొప్పితో వస్తాడు ఏమో.." అంటూ డాక్టర్ గురువా రెడ్డి ఆ పోస్ట్‌లో రాయడం విశేషం.
డాక్టర్ గురువారెడ్డి హైదరాబాద్‌లోని టాప్ ఆర్థోపెడిస్ట్‌లలో ఒకరు. ఈ మధ్యే రష్మిక.. ఆయనను కలిసింది. ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను కూడా డాక్టర్ గురువారెడ్డి షేర్ చేశారు. కొన్ని రోజులుగా రష్మిక మోకాలి నొప్పితో బాధపడుతోంది. అయితే ఇదేమంత పెద్ద సమస్య కాదని ఆమెను పరీక్షించిన తర్వాత సదరు డాక్టర్ చెప్పారు.
పుష్ప మూవీ చూసిన తర్వాత తాను రష్మికకు అభిమానిని అయినట్లు కూడా గురువారెడ్డి తెలిపారు. అదే సమయంలో భుజం నొప్పితో అల్లు అర్జున్ కూడా తన దగ్గరికి వస్తాడేమో అని జోక్ చేయడం విశేషం. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప 2 మూవీతోపాటు బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఆమె నటించిన గుడ్‌బై మూవీ అక్టోబర్ 7న రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్నూ మూవీలోనూ నటిస్తోంది.