Mlc Kavitha: లిక్కర్‌ పాలసీ కేసులో జూలై 3 వరకు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్ట్-rouse avenue court extends mlc kavithas remand till july 3 in liquor policy case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha: లిక్కర్‌ పాలసీ కేసులో జూలై 3 వరకు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్ట్

Mlc Kavitha: లిక్కర్‌ పాలసీ కేసులో జూలై 3 వరకు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్ట్

Sarath chandra.B HT Telugu
Jun 03, 2024 12:44 PM IST

Mlc Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కవితకు మరోమారు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. కవిత రిమాండ్‌ను జులై 3వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసులో మధ్యాహ్నం విచారణ జరుగనుంది.

జులై 3వరకు ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు
జులై 3వరకు ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు (HT_PRINT)

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో హాజరు పరిచారు. కవితకు జులై 3వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.

కవితపై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోర్టులో హాజరుపర్చడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా కస్టడీని పొడిగించారు. ఈ కేసులో మే 29న బీఆర్‌ఎస్ నేతపై చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం కోర్టు ఈ వారెంట్లు జారీ చేసింది.

ఇదే కేసులో నిందితులు ప్రిన్స్, దామోదర్, అరవింద్ సింగ్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండానే చార్జిషీట్ దాఖలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో గత మార్చిలో ఎన్‌ఫోర్స్‌‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సీబీఐ మరో కేసు నమోదు చేసింది.

గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ సాగనుంది. ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కేసు విచారణ చేపట్టనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం