Ponnam Prabhakar: ఆడియో వైరల్ వ్యవహారంలో హన్మకొండ ఆర్డీవోపై సిఎస్‌కు మంత్రి పొన్నం ఫిర్యాదు..
Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియో వైరల్ కావడం వెనుక హన్మకొండ ఆర్డీవో రమేశ్ ఉన్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఎస్‌కు ఫిర్యాదు చేశారు.
Ponnam Prabhakar: తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడిన మాటల్ని Audio Viral వైరల్ చేసిన వ్యహారంలో హన్మకొండ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు మంత్రి Ponnam పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఫోన్ కాన్ఫరెన్స్‌లో తాను మాట్లాడిన మాటల్ని ఉద్దేశపూర్వకంగా BRS బిఆర్‌ఎస్ నేతలకు షేర్ చేసి, వాటిని వైరల్ చేయడానికి ఆర్డీఓ రమేష్ బాధ్యుడని పొన్నం ప్రభాకర్ వివరించారు. కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కోసం తహసీల్దార్‌తో మాట్లాడుతున్న సమయంలో ఆర్డీవో కూడా కాన్ఫరెన్స్ కాల్‌లో ఉన్నారని, అతని నుంచి ఆడియో లీకైనట్టు మంత్రి పొన్నం అచెప్పారు.
తెలంగాణ Telangana రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ ఇటీవల ఇద్దరు అధికారులతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫోన్ సంభాషణ లీక్ కావడానికి అది సోషల్ మీడియాలో షేర్ కావడానికి RDO ఆర్డీవో కారణమని పొన్నం గుర్తించారు. ఈ ఘటనపై నిర్దారించుకున్న తర్వాత సిఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు మీడియాకు వివరించారు.
గత వారం కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కోసం హనుమకొండ ఆర్డీవో రమేశ్‌కు మంత్రి పొన్నం ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కమలాపూర్ తహసీల్దార్ మాధవిని కూడా Conference కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని సంభాషించారు. వారిద్దరితో పొన్నం ఫోన్‌లో మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీపై పలు సూచనలు చేశారు.
'గత ప్రభుత్వంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉన్నపుడు కూడా.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందనే ఆలోచనతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారని , ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అతను మా పార్టీ కాదని, ఆయన చేతికి ఒక్క చెక్కు కూడా వెళ్లకూడదని మంత్రి సూచించారు."
చెక్కుల పంపిణీలో అధికారులకు స్వేచ్ఛనిస్తున్నామని, వారే చెక్కులు పంచాలని, అవసరమైతే స్ధానిక సర్పంచులను తీసుకెళ్లి చెక్కులను ఇవ్వాలని ' మంత్రి సూచించారు. మంత్రి మాటలకు తహసీల్దార్ మాధవి..సరే సార్ అంటూ బదులిచ్చారు. తహసీల్దార్ మాధవితో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన ఆడియో ఈ నెల 15న వైరల్ అయింది.
అధికారులతో పొన్నం మాట్లాడిన సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై హన్మకొండ ఆర్డీవో నిర్వాకమేనని, ఉద్దేశ పూర్వకంగా తన మాటల్ని బిఆర్ఎస్ నేతలకు పంపారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు. కాన్ఫరెన్స్ కాల్ రికార్డు చేసిన ఆర్డీవో.. దానిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపారని వివరించారు.
తన ఫోన్ కాల్ రికార్డు చేయడంతో పాటు వాటిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపడంపై బాధ్యుడైన హనుమకొండ ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు పొన్నం చెప్పారు. ఆర్డీవోపై సీఎస్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారన్నారు.
వర్షాల్లేవు,అందుకే ఇబ్బందులు…
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందంటూ చేస్తోన్న ప్రచారంపై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబరులో సరైన వర్షాలు పడలేదని, 2022-23 వాతావరణ నివేదికను ప్రజలకు తెలియచేస్తామన్నారు.
హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు, గోదావరి, కృష్ణా, ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని పైప్‌లైన్ల ద్వారా తీసుకొస్తున్నట్లు మంత్రి చెప్పారు. నీటి ఎద్దడి ఏర్పడితే బూస్టర్ పైపుల ద్వారా నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తరలిస్తామని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి కూడా 3 టీఎంసీలు హైదరాబాద్ తరలిస్తున్నట్టు చెప్పారు.
సంబంధిత కథనం