Medaram bus fares: మేడారం జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఎక్కడి నుంచి ఎంతో తెలుసా?
Medaram bus fares:తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది.
Medaram bus fares: ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో వన దేవతలను దర్శించుకోవడానికి దాదాపు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.105 కోట్లతో జాతరలో ఏర్పాట్లు చేస్తోంది.
భక్తులను మేడారం చేర్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించగా.. గత జాతరలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహాలక్ష్మీ స్కీం ఇంప్లిమెంట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేట్ చేసే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 40 లక్షల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాకపోకలు సాగించే భక్తులకుTSRTC ఆర్టీసీ ఛార్జీలు కూడా డిసైడ్ చేశారు.
18 నుంచి బస్సులు స్టార్ట్
రాష్ట్ర వ్యాప్తంగా TSRTC 6 వేలకు పైగా బస్సులు నడిపే అవకాశం ఉండగా.. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే సుమారు 2,500 బస్సులు ఆపరేట్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాటిలో 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 22 చోట్ల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించుకునే వారి కోసం ప్రత్యేకంగా మేడారం బస్సులు నడిపిస్తున్నారు. కాగా ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుండగా.. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 6 వేల బస్సులను ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆపరేట్ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మహిళలకు ఫ్రీ.. మిగతా ఛార్జీలు ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు (Special Bus) నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఛార్జీలు కూడా నిర్ణయించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ స్కీం మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇక పురుషుల కోసం ఆర్టీసీ అధికారులు ఛార్జీలు విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన మేరకు బస్సులు నడిపే సెంటర్, కిలోమీటర్లు, పెద్దలు, చిన్నారులకు సంబంధించిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
1.హనుమకొండ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు ఉండగా.. పెద్దలకు ఛార్జీ 250, చిన్నారులకు 140 గా బస్ ఛార్జీ నిర్ణయించారు.
2. కాజీపేట నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140
3. వరంగల్ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140
4. జనగామ నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 370, చిన్నారుల ఛార్జీ: 210
5. హైదరాబాద్ నుంచి మేడారం 259 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 550, చిన్నారుల ఛార్జీ: 310
6. హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రాంతాల నుంచి మేడారం 274 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 600, చిన్నారుల ఛార్జీ: 320
7. స్టేషన్ ఘన్ పూర్ నుంచి మేడారం జాతర 140 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 180
8. నర్సంపేట నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 150
9. కొత్తగూడ నుంచి మేడారం జాతర 137 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 170
10. పరకాల నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140
11. చిట్యాల నుంచి మేడారం జాతర 115 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 140
12. మహబూబాబాద్ నుంచి మేడారం జాతర 155 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190
13. గూడూరు నుంచి మేడారం జాతర 125 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 280 , చిన్నారుల ఛార్జీ: 160
14. తొర్రూరు నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190
15. వర్ధన్నపేట నుంచి మేడారం జాతర 133 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 160
16. ఆత్మకూరు నుంచి మేడారం జాతర 90 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 210 , చిన్నారుల ఛార్జీ: 120
17. మల్లంపల్లి నుంచి మేడారం జాతర 75 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 180 , చిన్నారుల ఛార్జీ: 110
18. ములుగు నుంచి మేడారం జాతర 60 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150, చిన్నారుల ఛార్జీ: 90
19. భూపాలపల్లి నుంచి మేడారం జాతర 100 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 220, చిన్నారుల ఛార్జీ: 130
20. ములుగు గణపురం నుంచి మేడారం జాతర 80 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 200 , చిన్నారుల ఛార్జీ: 110
21. జంగాలపల్లి నుంచి మేడారం జాతర 55 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150 , చిన్నారుల ఛార్జీ: 90
22. పస్రా నుంచి మేడారం జాతర 30 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 80 , చిన్నారుల ఛార్జీ: 50
23. గోవిందరావుపేట నుంచి మేడారం జాతర 35 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 100 , చిన్నారుల ఛార్జీ: 60
24. తాడ్వాయి నుంచి మేడారం జాతర 16 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 60 , చిన్నారుల ఛార్జీ: 40
(హిందుస్తాన్ టైమ్స్, వరంగల్ ప్రతినిధి)