CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- వారం రోజుల్లో ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్-kodangal news in telugu cm revanth reddy says 200 free power 500 gas cylinder schemes implemented in a week ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- వారం రోజుల్లో ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్

CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్- వారం రోజుల్లో ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్

Bandaru Satyaprasad HT Telugu
Feb 21, 2024 09:16 PM IST

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. మార్చి 15న రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Gruha Jyothi), రూ.500లకే గ్యాస్ సిలిండర్(500 Gas Cylinder) అందిస్తామని ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించారు రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలో రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోస్గిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...మార్చి 15న రైతు భరోసా(Rythu Bharosa) అమలు చేస్తామని ప్రకటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలుచేసే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టంచేశారు.

కేసీఆర్ హయాంలోనే ఎక్కువ జల దోపిడీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జలదోపిడీ కంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. రాయలసీమను రతనాల సీమ చేసేందుకు కేసీఆర్ కృష్ణా జలాల తరలింపునకు సహకరించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలవరనే మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే పాలమూరుకు ఏం చేయలేదన్నారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్‌ ఓటు అడగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. 2014లో ప్రధాని మోదీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు చేస్తామని హామీ ఇచ్చారని, పదేళ్లైన జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవాలన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడంగల్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నారాయణపేట్-కొడంగల్(Kodangal) లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి రూ.2,945 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.6.8 కోట్ల వ్యయంతో కొడంగల్ లో ఆర్ అండ్ బీ అతిథి గృహం, రూ.344.5 కోట్ల వ్యయంతో కొడంగల్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ రోడ్లు, పలు బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రూ.27.886 కోట్లతో వికారాబాద్ జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొడంగల్ మండల కేంద్రంలోని బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీ కోసం రూ.25 కోట్లు, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, 220 పడకల హాస్పిటల్ కోసం రూ.224.50 కోట్లు కేటాయించారు. రూ.3.99 కోట్లతో దుద్యాల్ మండలంలోని హస్నాబాద్ లో 33/11 కేవీ సబ్ స్టేషన్ కు నిర్మించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం