Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ స్పెషల్ రైళ్లు ఇవే!-hyderabad south central railway running summer special trains between telugu states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ స్పెషల్ రైళ్లు ఇవే!

Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ స్పెషల్ రైళ్లు ఇవే!

Bandaru Satyaprasad HT Telugu
Apr 03, 2024 06:35 PM IST

Summer Special Trains : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే సమ్మర్ స్పెషల్ రైళ్లు నడపనుంది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.

సమ్మర్ స్పెషల్ రైళ్లు
సమ్మర్ స్పెషల్ రైళ్లు

Summer Special Trains : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులు(Summer Holidays) మొదలుకానున్నాయి. వేసవి సెలవుల్లో ఊళ్లకు వెళ్లేంటారు. సాధారణంగా వేసవిలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ సీజన్ రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషన్ రైళ్లు(Summer Special Trains) నడుపుతున్నట్లు ప్రకటించింది. రానున్న రెండు నెలలో పాటు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వివరాలు(Summer Special Trains)

  • రైలు నెం. 07030, సికింద్రాబాద్ -అగర్తలా, ప్రతీ సోమవారం... ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు
  • రైలు నెం. 07029, అగర్తలా- సికింద్రాబాద్‌, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం. 07046, సికింద్రాబాద్ నుంచి దిబ్రుగఢ్‌కు, ప్రతీ సోమవారం... ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు
  • రైలు నెం. 07047, దిబ్రుగఢ్‌ నుంచి సికింద్రాబాద్‌‌కు ప్రతీ గురువారం...ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు
  • రైలు నెం. 07637, తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీకి, ప్రతీ ఆదివారం....ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు
  • రైలు నెం. 07638, సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతికి. ప్రతీ సోమవారం...ఏప్రిల్ 8 నుంచి జులై 1 వరకు
  • రైలు నెం. 02575, హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కి, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం. 02576, గోరఖ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు, ప్రతీ ఆదివారం... ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు
  • రైలు నెం. 07007, సికింద్రాబాద్ నుంచి రక్సౌల్‌కు, ప్రతీ బుధవారం...ఏప్రిల్ 3 నుంచి జూన్ 26 వరకు
  • రైలు నెం. 07008 రక్సౌల్‌ నుంచి సికింద్రాబాద్‌కు, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం. 07051, హైదరాబాద్ నుంచి రక్సౌల్‌కు, ప్రతీ శనివారం... ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు
  • రైలు నెం. 07052, రక్సౌల్‌ నుంచి హైదరాబాద్‌కు, ప్రతీ మంగళవారం... ఏప్రిల్ 9 నుంచి జులై 2 వరకు
  • రైలు నెం. 07419, సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు, ప్రతీ శనివారం...ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు
  • రైలు నెం. 07420 దానాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు, ప్రతీ సోమవారం... ఏప్రిల్ 8 నుంచి జులై 1 వరకు
  • రైలు నెం.07115, హైదరాబాద్ నుంచి జైపూర్‌కు, ప్రతీ శుక్రవారం.... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం. 07116, జైపూర్‌ నుంచి హైదరాబాద్‌కు, ప్రతీ ఆదివారం... ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు
  • రైలు నెం. 01438, తిరుపతి నుంచి షోలాపూర్, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం. 01437, షోలాపూర్ నుంచి తిరుపతికి, ప్రతీ గురువారం... ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు
  • రైలు నెం.07191, కాచిగూడ నుంచి మధురై వరకు-ప్రతీ సోమవారం...ఏప్రిల్ 8 నుంచి జూన్ 24 వరకు
  • రైలు నెం.07192, మధురై నుంచి కాచిగూడ వరకు-ప్రతీ బుధవారం...ఏప్రిల్ 10 నుంచి జూన్ 26 వరకు
  • రైలు నెం.07435, కాచిగూడ -నాగర్‌కోయిల్, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం.07436, నాగర్‌ కోయిల్- కాచిగూడ, ప్రతీ ఆదివారం...ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు
  • రైలు నెం.07189, H.S నాందేడ్ - ఈరోడ్, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు
  • రైలు నెం.07190, ఈరోడ్ - H.S నాందేడ్, ప్రతీ ఆదివారం...ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు
  • రైలు నెం.07651, జల్నా-ఛప్రా, ప్రతీ బుధవారం...ఏప్రిల్ 03 నుంచి జూన్ 26 వరకు
  • రైలు నెం.07652, ఛప్రా-జల్నా, ప్రతీ శుక్రవారం... ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు

Whats_app_banner

సంబంధిత కథనం