Summer Vacation: వేసవి సెలవుల్లో అలా మేఘాలయ వెళ్లి రండి, ప్రకృతిలో పరవశించిపోవచ్చు, బడ్జెట్ కూడా తక్కువే-go to meghalaya during summer vacations the cost of traveling there is low ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Vacation: వేసవి సెలవుల్లో అలా మేఘాలయ వెళ్లి రండి, ప్రకృతిలో పరవశించిపోవచ్చు, బడ్జెట్ కూడా తక్కువే

Summer Vacation: వేసవి సెలవుల్లో అలా మేఘాలయ వెళ్లి రండి, ప్రకృతిలో పరవశించిపోవచ్చు, బడ్జెట్ కూడా తక్కువే

Haritha Chappa HT Telugu
Mar 30, 2024 03:40 PM IST

Summer Vacation: వేసవి వచ్చిందంటే చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు ఎంతోమంది ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఇలా ఎక్కువమంది ట్రిప్పులు వేసేందుకు ఇష్టపడతారు. ఓసారి మేఘాలయ ప్లాన్ చేయండి.

అందమైన మేఘాలయ
అందమైన మేఘాలయ (Pixabay)

Summer Vacation: వేసవి సెలవుల్లో చల్లని ప్రదేశాలకు ట్రిప్పులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువే. అందులోనూ సెలవుల్లో పిల్లలకు స్కూళ్లు కూడా ఉండవు. కాబట్టి ఫ్యామిలీ అంతా వెకేషన్‌కు వెళుతూ ఉంటారు. తమ బడ్జెట్‌ను బట్టి ఎక్కడికి వెళ్లాలోమధ్యతరగతి వారు ప్లాన్ చేసుకోవాలి. తక్కువ బడ్జెట్ లోనే ప్రకృతిలో పరవశించిపోవాలంటే మీరు మేఘాలయ ప్లాన్ చేయండి. ఇక్కడికి వెళ్లేందుకు పెద్దగా ఖర్చు అవ్వదు. ఈ రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి పిలుస్తూ ఉంటుంది. ఒక గంట సేపు ఆ ప్రకృతిలో కూర్చుంటే చాలు. శరీరం, మనసు రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడి వాతావరణం, అందమైన సంస్కృతి, పచ్చదనం కట్టిపడేస్తాయి.

మేఘాలయలో అందమైన కొండలు, లోయలు, జలపాతాలు, సరస్సులు, పొడవాటి చెట్లు, గుహలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ఫ్యామిలీతో వెళ్తే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మన దేశంలో ఉన్న పొడవైన అతిపెద్ద గుహలు మేఘాలయలో ఉన్నాయి. అక్కడికి వెళ్తే కచ్చితంగా సిజు గుహలను చూడండి.

మేఘాలయకు ఒక భిన్నమైన సంస్కృతి ఉంది. అక్కడ ఎక్కువగా గిరిజన తెగలు నివసిస్తూ ఉంటాయి. ఖాసి, జైయంతియా తెగలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్క తెగ ఒక ప్రత్యేక సంస్కృతిని, ఆచారాలను కలిగి ఉంటుంది. సాంప్రదాయ సంగీతాలు, నృత్యాలు, ఆహారాలు పర్యాటకలను ఆకర్షిస్తాయి. మేఘాలయలో ట్రెక్కింగ్, కేవింగ్, రాక్ క్లైంబింగ్, రివర్ రాఫ్టింగ్ వంటి ఎన్నో సహజ కార్యకలాపాలు చేయొచ్చు. అది కూడా అందమైన ప్రకృతి మధ్యనే. మేఘాలయకు వెళ్లారంటే మీకు అక్కడ ఎంజాయ్ చేసేందుకు 24 గంటలు సరిపోవు.

ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు మేఘాలయలో ఎన్నో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు, చర్చిలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న నార్త్యాంగ్ దుర్గా టెంపుల్ హిందువులకు ఎంతో నచ్చుతుంది. అలాగే షిల్లాంగ్ క్యాథడ్రల్ క్రైస్తవ సోదరులకు ఇష్టమైన ప్రదేశం. మేఘాలయలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణమే ఉంటుంది. అక్కడ ఎంత లేదన్న 28 డిగ్రీ సెంటీగ్రేడ్లకు మించి ఉష్ణోగ్రత పెరగదు. కాబట్టి ఏ సమయంలో వెళ్ళినా కూడా మేఘాలయ అందంగానే ఉంటుంది. వేసవిలో వెళితే మీరు కాస్త సేద తీరవచ్చు. అక్కడ ఉండే సరస్సులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే... వాటి నీడ కూడా సరస్సు అడుగు భాగాన క్లియర్ గా కనిపిస్తుంది.

లివింగ్ రూట్ వంతెనలు

మేఘాలయలో ఉండే లివింగ్ రూట్ వంతెనలను కచ్చితంగా చూడాల్సిందే. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. దట్టమైన అడవుల్లో ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉండే ఖాశీ తెగవారు రబ్బరు చెట్ల ఊడలతో ఈ బ్రిడ్జిలను నిర్మించారు. చిరపుంజి, మావ్లిన్నాంగ్ వంటి ప్రాంతాల్లో ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడవచ్చు.

మేఘాలయలో అనేక జలపాతాలు ఉన్నాయి. షిల్లాంగ్ దగ్గరలోక్రాంగ్ సూరి అనే జలపాతం. ఉంది షిల్లాంగ్ నుంచి మూడు గంటల ప్రయాణం చేస్తే వస్తుంది. ఎత్తైన కొండల మధ్య నుంచి పారే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది.

స్వచ్ఛమైన నది

అత్యంత స్వచ్ఛంగా ఉండే నది ఉమ్ గోట్. మావ్లిన్నాంగ్ నుంచి ఓ గంట ప్రయాణం చేస్తే డౌకి అనే చిన్న ఊరు వస్తుంది. ఈ ఊరికి దగ్గరలోనే ఈ స్వచ్ఛమైన నది ఉమ్‌గోట్ ఉంది. ఈ నదిని చూస్తే అడుగుభాగంలో ఉన్న రాళ్లు కూడా కనిపిస్తాయి. అంత స్వచ్ఛమైనది ఈ నది.

ఎలా వెళ్లాలి?

మేఘాలయ వెళ్లాంటే షిల్లాంగ్ లో ఉన్న విమానాశ్రయానికి చేరుకోవాలి. అందే రైలు ద్వారా వెళ్లాలనుకుంటే గౌహతి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ నుంచి మేఘాలయకు తక్కువ సమయంలోనే రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

WhatsApp channel

టాపిక్