BJP NVSS Prabhakar : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల వలసలు- కేసీఆర్, కేటీఆర్ చెబితేనే : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్-hyderabad bjp leader nvss prabhakar alleged kcr ktr plan to send brs leaders to congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Nvss Prabhakar : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల వలసలు- కేసీఆర్, కేటీఆర్ చెబితేనే : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

BJP NVSS Prabhakar : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతల వలసలు- కేసీఆర్, కేటీఆర్ చెబితేనే : బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

HT Telugu Desk HT Telugu
Mar 30, 2024 11:03 PM IST

BJP NVSS Prabhakar : కేసీఆర్, కేటీఆర్ చెబితేనే బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, డీజీపీ, మంత్రుల పేర్లు చేర్చాలని డిమాండ్ చేశారు.

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

BJP NVSS Prabhakar : ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత NVSS ప్రభాకర్(BJP NVSS Prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలంతా కేసీఆర్, కేటీఆర్ (KCR, KTR)లు చెబితేనే వెళుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పోలీసులు వాళ్లకి వాళ్లే చేశారా? లేక డీజీపీ చెప్తే చేశారా? నాటి సీఎం చెప్తే చేశారా? అంటూ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ మంత్రి కేటీఆర్ ను చేర్చి లోతుగా విచారించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్, అప్పటి డీజీపీ, మంత్రులను కూడా విచారించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ప్రభాకర్ కోరారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి

ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project)పై అనేక ఆరోపణలు చేసి....అధికారంలోకి వచ్చాక దానిపై విచారణ ఆపేసిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఉచిత గొర్రెల పంపకాల పథకం(Sheeps Scheme)లో కూడా అవినీతి జరిగిందని....ఆ కేసులో మాజీ మంత్రులను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)..... గడిచిన 100 రోజుల్లో ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పకుండా లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)రెఫరెండం అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ పాలన గురించి ఎక్కడ బయటపడుతుందో అని భయపడే రేవంత్ రెఫరెండం అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాఒకరినొకరు కాపాడుకోవడం కోసం కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలకు భవిష్యత్తు ఉండదని జోస్యం చెప్పారు. అంతంత బలం ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ (KCR)ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ సహకారంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress BRS) కలిసి పనిచేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

48 గంటల్లో ప్రభుత్వం కూలడం ఖాయం- ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) లాంటి వాళ్లు తమతో ఆరు మంది మంత్రులు టచ్ లో ఉన్నారని, మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకోవాలని ప్రయత్నించినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కూలిపోవడం ఖాయమన్నారు బీజేపీ లెజిస్లేటివ్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheswar Reddy)అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు(Note For Vote) భయం పట్టుకుందని, దాంతో ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడే ఆయనతో టచ్ లో లేడని.....రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఎంపీ టిక్కెట్ రాకుండా అడ్డుకుంది కూడా వెంకట్ రెడ్డే అన్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా వేరే పార్టీలో చేరే వారిని చెప్పుతో కొట్టాలి అన్న ఇదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్న వారిని చెప్పుతో కొడతాడా? అని ప్రశ్నించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి(Ranjith Reddy)పై అనేక అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకావాలని సవాల్ విసిరారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం