
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలకు లీగల్ నోటీస్ పంపనున్నట్లు తెలిపారు. 48 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.