Mla Maheshwar Reddy : బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం- మహేశ్వర్ రెడ్డి
BJP Mla Maheshwar Reddy : ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేసినా 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి సహా 6గురు మంత్రులు బీజేపీ అధిష్ఠానంతో టచ్ లో ఉన్నారని విమర్శించారు.
BJP Mla Maheshwar Reddy : 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJP Mla Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో 6గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress Mlas) టచ్ లో ఉన్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వం(Topple Congress Govt) కూలగొడతామన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 8 మంది బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు 5గురు మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారన్నారు.
ఒక్క ఎమ్మెల్యేను టచ్ చేసిన ప్రభుత్వం కూలగొడతాం
"అసలు మీ తమ్ముడు నీతో టచ్ లో ఉన్నాడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మీ తమ్ముడు నీతో టచ్ లేడంట. రాజగోపాల్ రెడ్డి భార్యకు ఎంపీ టికెట్(MP Ticket) ఇస్తానని మోసం చేశారంట. అసలు ఆమెకు టికెట్ రాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుకున్నారట. ముందు మీ పంచాయితీ చూసుకోండి. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు(BJP Mlas) ఎప్పటికీ అలా చేయ్యరు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేయాలని చూస్తే 48 గంట్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది"- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా మా వద్ద ఉంది
భువనగిరి ఎంపీ సీటును రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టెలిఫోన్ యాక్ట్ కేంద్రానికి సంబంధించిదని, ఫోన్ ట్యాపింగ్ కేసును(Phone Tapping Case) సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమవద్ద ఉందన్నారు. హైదరాబాద్ లో డబ్బులు వసూలు చేసి దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వాడుతుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గతంలో రంజిత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు గుర్తులేదా? అని ప్రశ్నించారు. రంజిత్ రెడ్డి అవినీతిపరుడు అని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు టికెట్ ఎలా ఇచ్చారని నిలదీశారు. లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని ఎలా అడుగుతారని నిలదీశారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి తాను షిండే పాత్ర పోషిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నది వాస్తవమన్నారు. కాంగ్రెస్ లో సైతం కోమటిరెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదన్నారు.
సంబంధిత కథనం