TG IPS Transfers : తెలంగాణలో 8 మంది ఐపీఎస్ లు బదిలీ, సీఎస్ ఉత్తర్వులు
TG IPS Transfers : తెలంగాణలో మరో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్ ను ప్రభుత్వం నియమించింది.
TG IPS Transfers : తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 8 మంది ఐపీఎస్‌ల అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్ ను నియమించారు. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా మహేష్ బాబాసాహెబ్, గవర్నర్ ఓఎస్డీగా సిరిశెట్టి సంకీర్త్, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ ను నియమించారు. భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి, ఏటూరునాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయను నియమిస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
44 మంది ఐఏఎస్ లు బదిలీ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 44 మంది ఐఏఎస్‍లను బదిలీ చేస్తూ జీవో నంబర్ 876 జారీ చేశారు. జీహెచ్‍ఎంసీ కమిషనర్‍గా ఆమ్రపాలిని నియమించారు. పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ.. క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యార్‌ను నియమించారు. హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండీ క్రాప్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌కు పోస్టింగ్ ఇచ్చారు. టీపీటీఆర్ ఐ డీజీగా అహ్మద్ నదీమ్‍కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా నియమించారు. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా సందీప్ ను నియమించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వి - జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 మంది అధికారులను బదిలీ చేశారు.
ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. జూన్ 17న తెలంగాణ వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ బాధ్యతలు నిర్వర్తించిన ఎల్ సుబ్బారాయుడిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు.
- జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్
- సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్
- హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
- జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాస్‌రావు
- అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా రుతురాజ్
- కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
- బాలానగర్ డీసీపీగా కె.సురేశ్‌కుమార్
- మహబూబ్‌నగర్ ఎస్పీగా ధరావత్ జానకి
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్
- సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
- శంషాబాద్ డీసీపీగా బి.రాజేశ్
- మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి
- వికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
- నల్గొండ ఎస్పీగా శరద్ చంద్రపవార్
- రైల్వేస్ ఎస్పీగా చందనాదీప్తి
సంబంధిత కథనం