CPM On Munugodu By poll: ఆ పార్టీకే మా మద్దతు - తేల్చేసిన సీపీయం-cpm to support trs in munugodu bypoll 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cpm On Munugodu By Poll: ఆ పార్టీకే మా మద్దతు - తేల్చేసిన సీపీయం

CPM On Munugodu By poll: ఆ పార్టీకే మా మద్దతు - తేల్చేసిన సీపీయం

Mahendra Maheshwaram HT Telugu
Sep 01, 2022 02:07 PM IST

మునుగోడు బైపోల్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చేసింది సీపీయం. ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కే మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరాలను వెల్లడించారు.

<p>టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సీపీయం</p>
టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన సీపీయం

cpm support to trs in munugodu bypoll: మునుగోడు బైపోల్ పై ప్రధాన పార్టీలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసేస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా సభలతో గ్రౌండ్ లోకి దిగిన ఆయా పార్టీలు.. కలిసి వచ్చే పార్టీలతో చర్చలు కూడా జరుపుతున్నాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ ముందంజలోనే ఉంది. మునుగోడు వేదికగా జరిగిన టీఆర్ఎస్ సభలో... సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో తమ మద్దతు టీఆర్ఎస్ కే ఉంటుందని స్పష్టం చేశారు.

munugodu bypoll 2022: ఇక ఈ సభలో ప్రసంగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ప్రగతిశీలపక్షాలతో భాగస్వామ్యం ఇప్పడే కాదని... వచ్చే ఎన్నికల్లోనూ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే సీపీయం కూడా తమకు మద్దతు ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన చేయని సీపీయం... తాజాగా క్లారిటీ ఇచ్చేసింది.

cpm tammineni veerabhadram on munugodu bypoll: గురువారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలు మద్దతు కోరాయని... కానీ తాము టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని వీరభద్రం చెప్పారు.

'బీజేపీనీ ఓడగొట్టడానికి టీఆర్ఎస్ కి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాం. అభివృద్ది కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ చెప్పడం కేవలం సాకు మాత్రమే.రాజగోపాల్ ఎందుకు రాజీనామా చేశాడో అమిత్ షా క్లియర్ గా చెప్పారు.కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకొంటోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉండబోతోంది. దీన్ని బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మార్చబోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బలమున్నా మూడో స్థానానికి పోతుంది. రేవంత్ చాలా కష్టపడుతున్నారు. ఆయన అధ్యక్షుడు అయ్యాక పార్టీ స్పీడ్ అయింది. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ మాకు ప్రధాన శత్రువు బీజేపీ. కేసీఆర్ అప్రజాస్వామిక పద్ధతుల వల్ల కొందరు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. అది చాలా ప్రమాదం. మునుగోడులో మాకు పట్టున్నా బీజేపీని ఓడగొట్టే శక్తి లేదు. మునుగోడు విషయంలో సీపీఏం లైన్ కి సీపీఐ లైన్ కి కొంత తేడా ఉంది. టీఆర్ఎస్ కి మా మద్దతు మునుగోడు వరకే. భవిష్యత్తులో టీఆర్ఎస్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి మా మద్దతు ప్రస్తుతానికి కేవలం మునుగోడు వరకే. లౌకిక, ప్రజాస్వామ్య శక్తులని కలిసిపోదామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం.

ఎన్నికల తర్వాత కూటమి కట్టడం ప్రాక్టికల్ గా సాధ్యమవుతుంది తప్పా ఇప్పుడే కూటమి కట్టడం సరైంది కాదని వీరభద్రం వ్యాఖ్యానించారు. మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం పై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ తో చర్చిస్తామన్నారు. కృష్ణయ్య హత్య విషయానికి మునుగోడులో టీఆర్ఎస్ మడ్డతుకి సంబంధం లేదని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పాలని వ్యాఖ్యానించారు.

Whats_app_banner