Munugode Bypoll : మునుగోడులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్-congress party local leaders joins trs party in munugode ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Congress Party Local Leaders Joins Trs Party In Munugode

Munugode Bypoll : మునుగోడులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్

Anand Sai HT Telugu
Aug 23, 2022 02:27 PM IST

మునుగోడులో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా నిలుపుకొనేందుకు కష్టపడుతోంది. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నామనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి తగలింది.

రేవంత్ రెడ్డి, కేసీఆర్(ఫైల్ ఫొటో)
రేవంత్ రెడ్డి, కేసీఆర్(ఫైల్ ఫొటో)

మునుగోడు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సభలు, సమావేశాలతో అందరి దృష్టి అటువైపే ఉంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా ఎన్నికలో గెలవాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తుండటంతో చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో చాలా ఆశలు పెట్టుకుంది. క్యాడర్ కూడా బలంగా ఉందనుకుంటున్న నేపథ్యంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని దాదాపు సగం మంది కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ట్రెండింగ్ వార్తలు

మునుగోడులో మొత్తం 71 ఎంపీటీసీలు, 159 సర్పంచ్‌లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 32 ఎంపీటీసీలు, 57 మంది సర్పంచ్‌లు ఉన్నారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. టీఆర్‌ఎస్ 38 ఎంపీటీసీలు, 88 సర్పంచ్‌లను గెలుచుకుంది. ఇతరులకు ఒక ఎంపీటీసీ, 14 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి.

కాంగ్రెస్ కు బలమైన స్థానం మునుగోడు నియోజకవర్గం. క్షేత్రస్థాయిలోనూ క్యాడర్ ఉంది. సర్పంచ్ లు, ఎంపీటీసీలూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అయితే ఆయన వెంట బీజేపీలోకి ఎంపీటీసీలు, సర్పంచ్ లు వస్తారని అనుకున్నారు. కానీ డజను మంది కూడా చేరలేదు. అయితే వీరు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపిస్తారని తెలిసిన టీఆర్ఎస్ వారిపై కన్నేసింది. టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంది.

టీఆర్‌ఎస్ తరఫున మునుగోడు ఉప ఎన్నిక ఇన్ ఛార్జీ గా మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ఆయనే క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ క్యాడర్ ను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే.. ఎంపీటీసీలు, సర్పంచ్ లను తీసుకొచ్చారు. మిగిలిన కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ స్థానిక నేతలను చేర్చుకోవడం వల్ల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశాలు పెరుగుతాయని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ రెండో స్థానం, బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని చెబుతున్నారు. బీజేపీ నేతలు, రాజ్‌గోపాల్‌రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి మీడియా, సోషల్‌ మీడియాలో హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారని, కానీ ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్ వైపే ఉంటుందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం