Congress: తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్.. మునుగోడుతో ఎంట్రీ ఉంటుందా..?-priyanka gandhi focus on telangana and munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Priyanka Gandhi Focus On Telangana And Munugodu Bypoll

Congress: తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్.. మునుగోడుతో ఎంట్రీ ఉంటుందా..?

Mahendra Maheshwaram HT Telugu
Aug 24, 2022 06:41 AM IST

priyaka gandi focus on telangana: తెలంగాణ కాంగ్రెస్.... గత కొద్దిరోజులుగా అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ గా నిలుస్తోంది. రాహుల్ రాకతో మారినట్లే అనిపించినా... మునుగోడు వేడితో మళ్లీ మొదలైంది. అయితే ఈసారి బంతి... ప్రియాంక గాంధీ కోర్టులోకి వెళ్లింది. ఢిల్లీ వేదికగా నేతలతోనూ కీలక భేటీని నిర్వహించారు. అంతే... ఇప్పుడు చర్చ అంతా ఆమె చుట్టే జరుగుతోంది.

టీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ
టీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ (twitter)

Telangana Congress: పీసీసీ ఎంపిక నుంచి పార్టీలో నిత్యం ఎప్పుడూ ఒక చర్చ నడుస్తూనే ఉంది..! అది ఏదో లోలోపల ఒకలా ఉంటే... బహిరంగంగా మాత్రం మాటల తుటాలు పేల్చేశారు నేతలు..! ఒకరు చెబితే మరోకరు వినే పరిస్థితి లేదు... ఇలాంటి సమయంలో అగ్రనేత రాహుల్... ఎంట్రీ ఇచ్చారు. పరిస్థితి మారినట్లే కనిపించినప్పటికీ… రాజగోపాల్ రెడ్డి రాజీనామా రూపంలో మరోసారి అంసతృప్తి రాగాలు ఊపందకున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్, మాణిక్యం ఠాగూర్ టార్గెట్ గా నేతలు ఆరోపణలు గుప్పించేశారు. పలువురు రాజీనామా కూడా చేశారు. ఇంతలోనే మునుగోడు బైపోల్ పరీక్ష రాయాల్సిన సమయం అసన్నమైంది. ఈ క్రమంలోనే ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక గాంధీ. నేతలతో కీలక సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అంతేనా పుల్ టైం ఫోకస్ ఉంటుందంటూ స్పష్టం చేశారు. దీంతో ఆమె రోల్ పై రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఉప ఎన్నికపై చర్చ…

Priyanka gandhi on munugodu bypoll: రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉ ఎన్నిక అంశంపై ప్రియాంక గాంధీ... మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన సమావేశానికి టీ కాంగ్రెస్ కు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆహ్వానం అందినప్పటికీ... ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. ఇదిలా ఉంటే... పార్టీలో నెలకొన్న సమస్యసలపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి గతకొదిరోజులాగా రాష్ట్ర ఇంఛార్జ్ గా ప్రియాంక గాంధీ వస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. అలా జరగలేదు. కానీ అనూహ్యంగా రాష్ట్ర నేతలతో ఆమె భేటీ నిర్వహించటంతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే రాహుల్ యాత్ర ఖరారైనా నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారనే వార్తలు కూడ వినిపిస్తోంది.

తాజాగా భేటీలో తెలంగాణ కాంగ్రెస్ కి పూర్తి సమయం ఇస్తానని ప్రియాంకా గాంధీ... చెప్పటంతో నేతలతో పాటు కేడర్ లో కొత్త జోష్ ను నింపినట్లు అవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విబేధాలపై కూడా ఆరా తీసిన ప్రియాంక... పలు సూచనలు చేసినట్లు సమాచారం. పార్టీ నాయకత్వంపై గరంగరంగా ఉన్న కోమటిరెడ్డితోనూ చర్చలు జరిపేలా.... దూతలను కూడా ఎంపిక చేశారు ప్రియాంక. మునుగోడు బైపోల్ విషయంపై ప్రత్యేక చర్చ జరిపారు. ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాలని...ఆ దిశగా కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో... తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త రూట్ లో వెళ్తోందా అన్న చర్చ మొదలైంది.

సభపై ప్లాన్...!

మునుగోడులో ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించాయి. చేరికలపై ఫోకస్ పెట్టి... ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌ సైతం మునుగోడులో మునుగోడులో బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తోంది.సెప్టెంబర్‌ తొలి వారంలో మునుగోడులో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కూడా ప్రియాంకనే రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె కూడా నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

మొత్తంగా నేతలతో సమాలోచనలతో పాటు... మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక సూచనలు చేయటంతో....ఆమె తెలంగాణపై క్లియర్ కట్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు రాహుల్ డైరెక్షన్ లో నడిచిన రాజకీయాలు.... రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీనే సెంటర్ పాయింట్ అవుతారనే చర్చ జోరందుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం