Congress | ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు హస్తం పార్టీలో చేరారు. వారిని ఢిల్లీకి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

మంచిర్యాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పలువురు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, మాజీ విప్ ఈరవర్తి అనిల్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ చేరడానికి బాల్క సుమన్ తో విభేదాలే కారణంగా తెలుస్తోంది. నల్లాల ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం గెలిచారు. 2014లో గెలిచాకా ప్రభుత్వ విప్ గా కూడా పని చేశారు. ఆయన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి ప్రస్తుతం మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. కిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు ఓదెలు. కానీ అనూహ్యంగా చెన్నూరు నుంచి.. బాల్క సుమన్ కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో మంచిర్యాల జిల్లాలో రాజకీయంగా వివాదం నడిచింది. మరోవైపు తనను వేధిస్తున్నట్టుగా ఓదెలు ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ లో చేరిన తర్వాత.. నల్లాల ఓదెలు మీడియాతో మాట్లాడారు. 2018లో తనకు టికెట్ ఇవ్వకపోయినా.. కేసీఆర్ ఆదేశాల మేరకు సుమన్ గెలుపు కోసం కృషి చేశానని తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాల్క సుమన్ తమను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రలు పన్నినట్టుగా చెప్పారు. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా తన భార్య భాగ్యలక్ష్మి ఉందని. ఆమె విషయంలో ప్రోటో కాల్ పాటించడంలేదన్నారు. ఇలా ఎన్నో విషయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ ద్రోహులకే టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఉద్యమకారులను పట్టించుకోవడంలేదని.. అందుకే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు నల్లాల ఓదెలు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్