Telangana Assembly : అదానీ, రేవంత్ భాయ్ భాయ్.. అసెంబ్లీ గేటు వద్ద టీషర్ట్ లొల్లి!-clashes over adani and revanth t shirts at telangana assembly gate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : అదానీ, రేవంత్ భాయ్ భాయ్.. అసెంబ్లీ గేటు వద్ద టీషర్ట్ లొల్లి!

Telangana Assembly : అదానీ, రేవంత్ భాయ్ భాయ్.. అసెంబ్లీ గేటు వద్ద టీషర్ట్ లొల్లి!

Basani Shiva Kumar HT Telugu
Dec 09, 2024 10:58 AM IST

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయ్యింది. తొలిరోజే బీఆర్ఎస్ వినూత్న నిరసన తెలిపింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అదానీ, రేవంత్ ఫొటో ఉన్న టీ షర్టులను ధరించి అసెంబ్లీకి వచ్చారు. వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ భగ్గుమంది.

అసెంబ్లీ గేటు వద్ద టీషర్ట్ లొల్లి
అసెంబ్లీ గేటు వద్ద టీషర్ట్ లొల్లి

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద టీ షర్ట్స్ లొల్లి జరిగింది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అదానీ, రేవంత్ ఫొటోలు ఉన్న టీ షర్టులను ధరించి అసెంబ్లికి రావడంతో.. బీఆర్ఎస్ సభ్యులను గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేటువద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. అటు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కేటీఆర్ ఫైర్..

'ఢిల్లీలో అదానితో కుస్తీ.. గల్లీలో దోస్తీనా. రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా వినడం లేదు. అందుకే టీషర్టులు ధరించి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయబోతున్నాం. తెలంగాణ తల్లి మాది. కాంగ్రెస్ తల్లి మీది. బతకమ్మ తీసి.. చేయి గుర్తు పెడతారా' అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీష్ ఆగ్రహం..

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల.. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదానీ దొంగ అని, అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే.. రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటడు. అలయ్ బలయ్ చేసుకుంటడు. ఆదానీతో వేలకోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకుంటడు. ఇదెక్కడి న్యాయం' హరీష్ ప్రశ్నించారు.

'వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియచేస్తుంటాయి. అడ్డుకోవడం దుర్మార్గం. అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయట పడుతాయని ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆదానీతో చీకటి ఒప్పందం బయటపడిందని, మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నరు. మమ్మల్ని సభలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి? పార్లమెంట్ లో రాహుల్, ప్రియాంకలు ఆదానీ, మోదీ భాయి భాయి అనే స్లోగన్స్‌తో టీషర్ట్స్ వేసుకున్నరు. మేము ఇక్కడ అదే విధంగా మీ చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తే తప్పేంటి.. నువ్వు తప్పు చేసినవు కాబట్టే నీకు భయం' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Whats_app_banner