తెలంగాణ, ఏపీలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కార్తీక మాసం ఎఫెక్ట్ తో చికెన్ ధరలు పడిపోయాయి. మొన్నటి వరకు భారీగా ఉన్న ధరలు క్రమంగా తగ్గముఖం పట్టాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండడంతో చికెన్ ధరలు సగానికి తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.
ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ మాసంలో పూజలు, ఉపావాసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది నాన్ వెజ్ కూ దూరంగా ఉంటారు. దీంతో ధరలు కాస్త... అమాంతం పడిపోయాయి. డిమాండ్ కూడా తగ్గిపోవటంతో పరిస్థితి మారిపోయింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో చికెన్(స్కిల్ లెస్) ధర రూ. 200గా ఉంది. విత్ స్కిన్ తో అయితే 160 - 170 మధ్య విక్రయిస్తున్నారు. అదే 15 రోజుల కిందట చూస్తే… చికెన్ ధరలు భారీగా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270 నుండి రూ.300ల మధ్య పలికింది. కానీ కార్తీక మాసం రావటంతో… ధరలు క్రమంగా దిగివచ్చాయి. మరో రెండు వారాలు కూడా ధరలు ఈ విధంగానే ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో కూడా చికెన్ ధరలు భారీగా తగ్గాయి.
మరోవైపు చికెన్ ధరలు భారీగా తగ్గడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం మేత పెట్టుబడి రావడంలేదని వాపోతున్నారు. అయితే త్వరలోనే న్యూ ఇయర్ రాబోతుండటంతో… అప్పుటివరకు సీన్ మారిపోతుందని చెబుతున్నారు.
కార్తీక మాసం పూర్తి అయితే మళ్లీ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. క్మిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఉంటాయి. చికెన్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. డిసెంబర్ నెలాఖరు నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇక జనవరిలో సంక్రాంతి పండుగ కూడా ఉంటుంది. ఈ సమయానికి మరింత రేట్లు పెరుగొచ్చని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితిపై హయతన్ నగర్ లో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో మాట్లాడారు. కార్తీక మాసం రావటంతో ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. డిసెంబర్ నెలఖారులో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం