ఆదివారం వచ్చిందంటే.. నాన్ వెజ్ ప్రియులు కొత్త తరహాలో రుచులను ఆస్వాదించాలని తహతహలాడుతుంటారు. అలాంటి వారికి ఈరోజు ఆంధ్రా స్టయిల్‌లో చికెన్ ఫ్రై చేసి ఒకసారి టేస్ట్ చేయించండి. పప్పు, సాంబారు, రసంతో కలిపి ఈ చికెన్ ఫ్రైని తినవచ్చు. దోశ, పుల్కా, చపాతితో కలిసి తింటే ఈ ఫ్రై రుచి మరింత పెరుగుతుంది.
ఈ చికెన్ ఫ్రైలో నిమ్మరసం పిండి, ఉల్లిపాయతో కలిపి తింటే.. జీవితంలో రుచిని మర్చిపోలేరు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా, లేదా స్పెషల్ రోజుల్లో కూడా ఈ ఫ్రైను మీరు ట్రై చేసి వారిని సర్‌ప్రైజ్ చేయవచ్చు.