Janhvi Kapoor: అమీర్‌పేటలో హీరోయిన్ జాన్వీకపూర్ పూజలు.. భక్తుల ముసుగులో ఎగబడిన అభిమానులు
Ameerpet Temple: దేవర సినిమాతో ఈ ఏడాది సందడి చేసిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. షూట్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన జాన్వీ.. అమీర్‌పేటలో ఒక దేవాలయానికి వెళ్లింది.
జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఇటీవల విడుదలైన దేవర పార్ట్-1 మూవీలో ఆడిన పాడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ .. హైదరాబాద్‌లోని అమీర్‌పేటకి సమీపంలోన ఒక గుడిలో తాజాగా ప్రత్యేక పూజలు నిర్వహించింది. జాన్వీ అక్కడికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు.. ఆమెతో కలిసి ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.
టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ కోసం దాదాపు ఏడేళ్లు ఎదురుచూసిన జాన్వీ కపూర్.. దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. దేవర పార్ట్-1లో జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నా.. కనిపించిన కాసేపు తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. దేవర పార్ట్-2లో జాన్వీ రూల్ కీలకంగా ఉండనుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.
రామ్ చరణ్‌తో జతకట్టిన జాన్వీ
ఎన్టీఆర్‌తో దేవరలో చేస్తుండగానే.. రామ్ చరణ్‌తో సినిమాకి జాన్వీ కపూర్ సంతకం చేసింది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించి ఫొటో షూట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుండగా.. గ్యాప్‌లో అమీర్‌పేటకి సమీపంలోని మధురానగర్ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లిన జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఫొటోల కోసం ఎగబడిన ఫ్యాన్స్
జాన్వీ కపూర్.. మధురానగర్ ఆంజనేయస్వామి టెంపుల్‌కి వచ్చిందని తెలియగానే పెద్ద సంఖ్యలో అక్కడికి జనం చేరుకున్నారు. కొంత మంది భక్తుల ముసుగులో దేవాలయంలోకి వెళ్లి జాన్వీ కపూర్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా జాన్వీ కపూర్ దర్శించుకున్న విషయం తెలిసిందే.
జాన్వీ కపూర్‌కి భక్తి చాలా ఎక్కువే. గతంలో అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకి కూడా ఈ హీరోయిన్ నడిచింది. ఆలయాలకి వెళ్లేటప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనే జాన్వీ కపూర్ కనిపిస్తుంటుంది.