Hyderabad : ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ, నాన్నను చంపేస్తా.. యువతిని బెదిరించిన యువకుడు
Hyderabad : ప్రేమ పేరుతో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తాను చెప్పినట్టు చేయకపోతే.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా సదరు యువకుడిపై కేసు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన హైదారాబద్‌లో జరిగింది.
ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ, నాన్నను చంపేస్తానని ఓ యువకుడు.. యువతిని బెదిరించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో జరిగింది. బెదిరింపులతో ఆగని యువకుడు.. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు యువతి ఆరోపించింది. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది.
బాధిత యువతి తెలిపిన కథనం ప్రకారం.. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఫ్రెండ్‌గా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేధింస్తున్నాడని బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని తెలిపింది. సరదాగా ఉన్న సమయంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోస్, వీడియోలు అందరికి చూపిస్తా అంటూ బెదిరించినట్టు యువతి వాపోయింది.
కాలేజీ నుండి వస్తున్న సమయంలో వెంటపడి.. బలవంతంగా తన బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హత్యాచారం చేసాడని విద్యార్థిని ఆరోపించింది. చాలా సార్లు కాలేజీలో వెంటబడి కొట్టాడని, బంధువుల అందరికి ఫోన్ చేసి మీ బిడ్డని చంపుతా అని బెదిరిస్తున్నాడని వాపోయింది. యువకుడి నుంచి తన కుటుంబానికి ప్రాణహని ఉందని భయాందోళన వ్యక్తం చేసింది.
యువతి ఇంటికి వచ్చి అడ్డుపడ్డ తన తండ్రి మీద దాడికి దిగాడని.. తనకు తెలిసిన కొంత మంది అమ్మాయిలను కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి తెలిపింది. గతంలో కూడా నాగార్జునసాగర్‌లో కంప్లైంట్ ఇవ్వగా.. అక్కడ కూడా కేసు అయ్యిందని పోలీసులు వెల్లడించారు. చెరుకుపల్లి విజయ్‌పై చర్యలు తీసుకోవాలని యువతి డిమాండ్ చేసింది.
పోలీసులకు భయపడి..
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు భయపడి యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన శంషాబాద్ ఏరియాలో జరిగింది. శంషాబాద్ ఫ్లైఓవర్ పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి, మద్యం మత్తులో ఉన్న యువకుడు రాంగ్ రూట్లో రివర్స్ తీసుకున్నాడు. రాంగ్ రూట్లో వేగంగా వెళ్తూ ఓ కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.