ORR Accident : శంషాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు దుర్మరణం
శంషాబాద్ కు దగ్గర్లో ఉన్న పెద్ద గోల్కొండ ORRపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు
శంషాబాద్ కు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తుపాన్ వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్…
హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోపాలపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులను జీవనోపాధిగా ఎంచుకున్నాడు. ముంబైకి చెందిన గ్యాంగ్ లతో పరిచయాలు పెంచుకుని, 2016 నుంచి క్రికెట్ బెట్టింగ్ దందా మొదలు పెట్టాడు.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా పందెం కాయడం, వాట్సాప్ ద్వారా బెట్టింగ్ రాయుళ్లతో వ్యవహారం అంతా నడిపించేవాడు. మొదట హైదరాబాద్ లో ఉంటూ ఈ తతంగం అంతా నడిపించగా..2019లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన ప్రసాద్ జైలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చాడు. కానీ ఆదాయ మార్గంగా ఎంచుకున్న బెట్టింగులను మాత్రం వదలలేక పోయాడు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ కు మకాం మార్చి మళ్లీ అదే దందా మొదలు పెట్టాడు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు నిత్యం లక్షలు, కోట్లలో లావాదేవీలు నడిపించేవాడు.
కాగా 2021లో దందా జోరుగా నడుస్తున్న సమయంలో వరంగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు అక్కడి వ్యవహారం చూసి షాక్ అయ్యారు. ప్రసాద్ ఇంట్లో నోట్లు కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి. దీంతో అతడిని పట్టుకున్న పోలీసులు రూ.2 కోట్ల నగదును సీజ్ చేశారు. అనంతరం ప్రసాద్ తో పాటు మరికొందరిని జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రసాద్ మరోసారి బెట్టింగ్ దందాకే మొగ్గు చూపాడు.
బుకీగా ఆదాయం ఫుల్లుగా ఉండటంతో.. అదే మార్గంలో నడవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2022 జూన్ లో మరోసారి ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో 20 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో ఉన్న లింక్ ల నేపథ్యంలో అక్కడి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.