Finance Commission Meeting : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి, ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి-16th finance commission meeting held in praja bhavan cm revanth reddy demands 50 percent in central taxes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Finance Commission Meeting : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి, ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

Finance Commission Meeting : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి, ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Sep 10, 2024 02:37 PM IST

16th Finance Commission Meeting : హైదరాబాద్ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి...కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలని కోరారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి, ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి, ఆర్థిక సంఘం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

16th Finance Commission Meeting : హైదరాబాద్ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అన్నారు.

"మన దేశాభివృద్ధి లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ... ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థికసంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయి. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది"- సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి

రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

ఈ డిమాండ్ ను నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలని ఆర్థిక సంఘాన్ని కోరారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మద్దతు ఇవ్వాలన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆర్థిక సంఘం సిఫారసులు ఉపయోగపడతాయని నమ్ముతున్నామన్నారు.

16వ ఆర్థిక సంఘం సమావేశం

తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం ప్రజాభవన్ లో భేటీ అయ్యింది. డాక్టర్ అరవింద్ పనగారియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, సౌమ్యకాంతి ఘోష్ పాల్గొన్నారు.యూనియన్ సెక్రటరీ రిత్విక్ పాండేతో పాటు వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సంప్రదింపులు జరుపుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం