Gold and Silver price today : మరింత దిగొస్తున్న పసిడి, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..-gold and silver price today 9th september 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : మరింత దిగొస్తున్న పసిడి, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Gold and Silver price today : మరింత దిగొస్తున్న పసిడి, వెండి ధరలు- హైదరాబాద్​లో రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu
Sep 09, 2024 05:35 AM IST

Gold and Silver price today : దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and Silver price today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,790కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 66,800గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,67,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,679గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 72,860గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,870గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,28,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,286గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,940గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,010గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,790 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,860గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,790గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,860గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,790గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,860గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,790గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,860గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,840గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,910గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,790గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,860గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,440గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 84,500గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 84,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,400.. బెంగళూరులో రూ. 83,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 200 పడి రూ. 24,860కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 25,060గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,860గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం